America: అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

Gun Fire in America: అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచోసుకున్నాయి. ఈ కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి చెందారు. మృతుడు తెలంగాణకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాకు కేశంపేటకు చెందిన ప్రవీణ్(27)గా గుర్తించారు. కాగా, ప్రవీణ్ ఎంఎస్ సెకండియర్ చదువుతున్నాడు.
వివరాల ప్రకారం.. కేశంపేట మండలానికి చెందిన గంప రాఘవులు, రమాదేవి దంపతులకు కుమారుడు ప్రవీణ్, కుమార్తె ఉన్నారు. యూఎస్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ప్రవీణ్ హత్యకు గురయ్యారు. ప్రవీణ్ ఇటీవల ఓ స్టార్ హోటల్‌లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుతున్నట్లు సమాచారం.
అయితే ప్రవీణ్ విస్కాన్సిన్ మిల్వాంకిలో నివాసం ఉంటుండగా.. అక్కడ దగ్గరలో ఓ బీచ్ ఉంది. తాజాగా, ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ మిత్రులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రవీణ్ మృతి చెందడంతో కేశంపేటలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.