Home / IMD
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు.
తెలంగాణ పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది
తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయని. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో షీర్ జోన్ ఎఫెక్ట్ కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.