Home / Health news
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), మహిళల్లో హార్మోన్ల రుగ్మత, ఇది చిన్న తిత్తులతో విస్తరించిన అండాశయాలకు కారణమవుతుంది. దీనివలన అధిక రక్తపోటు, గుండె మరియు రక్తనాళాల సమస్యలు మరియు గర్భాశయ క్యాన్సర్ కు గురయ్యే అవకాశముంది. పిసిఒఎస్ ఉన్న స్త్రీలు గర్బం దాల్చడానికి సమస్యలను ఎదుర్కొంటారు.
ఆహారంలో ఎక్కువ ఉప్పు వేసుకునే వారు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఐదు లక్షల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ఎప్పుడూ లేదా అరుదుగా తమ ఆహారంలో ఉప్పు కలపని వారితో పోలిస్తే, క్రమం తప్పకుండా చేసే వారు అకాల మరణానికి గురయ్యే అవకాశం 28 శాతం ఎక్కువ.
అత్యంత సాధారణ వ్యాధులలో కీళ్లనొప్పులు ఒకటి. ఆర్థరైటిస్ వల్ల కండరాలు, ఎముకలు మరియు కీళ్లలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా పిలువబడే వ్యాధి కారణంగా సంభవించవచ్చు. ఈ నొప్పులు మన కండరాలు, ఎముకలు మరియు కీళ్ల అరిగిపోవడం వల్ల కూడా సంభవించవచ్చు. వృద్ధాప్యం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు.
ఇటీవలకాలంలో గ్రీన్ టీ మీద ప్రజలకు అవగాహన పెరిగింది. రోజూ తాగే టీకి ప్రత్యామ్నాయంగా దీనిపై ఆధారపడుతున్నారు. గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల వల్లే దీని వినియోగం విస్తృతంగా పెరిగింది. ఈ టీ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి.
2011 నుండి జూలై 15ని ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన కొన్ని సాధారణ అపోహల గురించి అలాంటి శస్త్రచికిత్సలను కోరుకునే వారు తెలుసుకోవాలి. ప్లాస్టిక్ సర్జన్లు తమ శస్త్రచికిత్సలలో 'ప్లాస్టిక్' లేదా 'కృత్రిమ'వస్తువును ఏదైనా ఉపయోగిస్తారు.
గుమ్మడికాయను సాధారణంగా కూరగాయగా ఉపయోగించడం పరిపాటి. అయితే గుమ్మడికాయ మాత్రమే కాదు గుమ్మడి గింజలు తినడం వలన కూడ మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి.. గుమ్మడి కాయ గింజలను తృణధాన్యాలు, సూప్స్ మరియు సలాడ్లలో చేర్చడం ద్వారా
వర్షాకాలంలో గాలి, నీరు కలుషితమై ఇన్ ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, సైనస్, డయేరియా, చికున్ గున్యా వంటి జబ్బులు అధికంగా వేధిస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే జబ్బుల నుంచి రక్షణ
పొత్తికడుపు కొవ్వు. దీనిని విసెరల్ ఫ్యాట్ అని కూడా పిలుస్తారు, ఇది కడుపులో కండరాల క్రింద, కాలేయం, ప్రేగులు మరియు కడుపు వంటి అవయవాల చుట్టూ లోతుగా నిల్వ చేయబడిన కొవ్వు. ఈ కొవ్వు పేరుకుపోవడానికి కారణాలు చాలా ఉండవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడం మరియు ఒత్తిడి., హార్మోన్ల అసాధారణతలు దీనికి దోహదం చేస్తాయి.
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.