Home / BJP
మంత్రి హరీష్ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సూచించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని స్పష్టం చేసారు.
మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమిచేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.
తెలంగాణలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. సెప్టెంబరు 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఆ రోజు హైదరాబాద్‌లో జరిగే కవాతుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.
కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అందరూ తన వెనుక ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని, అయితే అది అంత సులభం కాదన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారును సాగనంపాల్సి ఉందని సమయం ఆసన్నమయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం నీతీష్ కుమార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని.. లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా సినిమా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్ మిథాలీ, నటుడు నితిన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్లో సుమారు గంట పాటు వీరిద్దరితోఆయన చర్చించారు.