Home / Andhra Pradesh
త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు కానుందా? అందుకోసం సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారా? అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారా? కోర్టుల్లో కేసులు ఉండగా, విశాఖను రాజధాని చేస్తే, ఎదురయ్యే ఇబ్బందులేంటి?
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి వేడి సాంబారులో పడి చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
ఆయన మండల రెవెన్యూ అధికారి. అది అతని వృత్తి. కానీ అతని అభిరుచి కళలు. ఆయన ఎవరో కాదు కొత్తవలస తహశీల్దార్ ప్రసాదరావు. తాజాగా ఆయన ’కాంతారా‘ గెటప్‌తో గుంటూరు జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించారు.
రాష్ట్రవిభజన,అమరావతి రాజధాని కేసుల విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. అమరావతి పై 8, రాష్ట్ర విభజన పై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఇటీవల ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితి గురించి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కామెంట్స్ చేశారు.
గన్ మాట పవన్ నోట, అవును మీరు వింటున్నది నిజమే. విజయనగరం నుంచి కొత్త నినాదం అందుకున్నారు జన సేనాని పవన్ కల్యాణ్. ఏంటా కొత్త నినాదం. అది పవన్‌కు వర్కవుట్ అవుతుందా? జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి.
ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అని జనసేన పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.
పాలతో అభిషేకాల గురించి తెలుసు. రకరకాల పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేయడం చూశాం. కానీ ఏలూరు జిల్లాలో కారంతో అభిషేకం చేశారు భక్తులు, దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో దేవీ ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి బహిరంగ సభ, ఇతర ఏర్పాట్లను చేసింది. లక్షల మందిని జనాన్ని సమీకరించింది. అయితే ప్రధానమంత్రి మోదీ నోట కనీసం చిన్న ప్రశంస కూడా రాలేదు.
ఏపీ మంత్రి ఆర్కే రోజా కాసేపట్లో ప్రారంభించనున్న గ్రామ సచివాలయ భవనానికి వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తాళం వేయడం సంచలనం కలిగించింది.