Home / AHA
నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ రెండవ సీజన్ లో నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్ ముఖ్య అతిధులుగా ప్రారంభోత్సవ ఎపిసోడ్‌కి హాజరయ్యారు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను ఆహా సంస్థ రిలీజ్ చేసింది. బాలయ్య షో కు మొదటి గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 'మీ జీవితంలో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి బావా' అని చంద్రబాబును బాలకృష్ణ అడుగగా దీనికి చంద్రబాబు చెప్పిన సమాధానానికి ప్రజలందరూ ఆశ్చర్యపోతూ చంద్రబాబు కూడా మోస్ట్ రొమాంటిక్ పర్సనే అనుకుంటారు.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. మరింత రంజుగా షో ప్రారంభిద్దాం అంటున్న బాలయ్య లుక్ ఈ ట్రైలర్లో అదిరిపోయింది. అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం అన్‌స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.
బాలయ్య ఆ పేరే ఒక ఊపుతెప్పిస్తుంది. ఇంక థియేటర్లలో అయితే బాలయ్య వస్తే ఈలల మోత మోగుతుందనుకోండి. కేవలం థియేటర్లలోనే బాలయ్య హంగామా చేస్తాడు అనుకునేవారికి ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన అన్ స్టాపబుల్ ఘన విజయాన్ని సాధించి మాటల్లేకుండా చేసింది. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య అన్ స్టాపబుల్ రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమోకు విశేష స్పందన లభించింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడెప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి బాలయ్య పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు.
నందమూరి బాలకృష్ణ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ వేదిక పై సందడి చేయనున్నారు. ఇప్పటి వరకు వీరిద్దని ఒకే వేదిక పై మనం ఎప్పుడు చూడలేదు.
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వేదికగా రూపొందించబడిన అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందనే చెప్పవచ్చు. నందమూరి నటసింహంలోని మరో కోణాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా వీక్షించారు ప్రజలు. కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 వస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించంది. దెబ్బకు థింకింగ్ మారిపోతుందిలే..