Last Updated:

IND vs ENG: చితక్కొట్టేశారు భయ్యా.. సెమీస్ లో టీమిండియాకు ఘోర పరాభవం

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత జట్టు కథ కంచికి చేరింది. 130 కోట్ల భారతీయుల 15 ఏళ్ల ఎదురు చూపులు కలగానే మిగిలిపోయాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్ తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. టీమిండియా ఇచ్చిన 169 పరుగులు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

IND vs ENG: చితక్కొట్టేశారు భయ్యా.. సెమీస్ లో టీమిండియాకు ఘోర పరాభవం

IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత జట్టు కథ కంచికి చేరింది. 130 కోట్ల భారతీయుల 15 ఏళ్ల ఎదురు చూపులు కలగానే మిగిలిపోయాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్ తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. టీమిండియా ఇచ్చిన 169 పరుగులు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి వికెట్ నష్టపోకుండా ఆంగ్ల బ్యాటర్లు చితక్కొట్టారు. ఇంకా నాలుగు ఓవర్లు మిగిలుండగానే 170 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందారు.

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం విదితమే. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. 169 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ఆంగ్ల ఓపెనర్లు ఓపెనర్లు హేల్స్, జోస్ బట్లర్ మైదానంలో చెలరేగిపోయారు. ఒక్క  వికెట్ కూడా నష్టపోకుండా పరుగుల వరద పారించారు. ఏ బాల్ వేసినా బౌండరీ దాటిస్తూ 16 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేశారు. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ 49 బంతుల్లో 80 రన్స్ చేయగా అందులో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. అలెక్స్ హేల్స్‌ 47 బంతుల్లో నాలుగు ఫోర్లు ఏడు సిక్సులతో 86 పరుగులు తీశాడు. మొత్తంగా టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు. ఈ గెలుపుతో ఈనెల 13న జరుగనున్న టైటిల్ పోరులో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్టులు ముఖాముఖీ తలపడనున్నాయి.

ఇదీ చదవండి: ఐసీసీ T20 ర్యాంకింగ్స్.. టాప్ టెన్ లో కోహ్లికి దక్కని స్దానం

ఇవి కూడా చదవండి: