Chandramukhi 2 Movie Review : రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ “చంద్రముఖి 2” రివ్యూ, రేటింగ్ ?

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 03:56 PM IST

Cast & Crew

  • రాఘవ లారెన్స్ (Hero)
  • కంగనా రనౌత్ (Heroine)
  • వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు (Cast)
  • పి.వాసు (Director)
  • సుబాస్కరన్ (Producer)
  • ఎం.ఎం.కీరవాణి (Music)
  • ఆర్డీ రాజశేఖర్ (Cinematography)
2.5

Chandramukhi 2 Movie Review : రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన చిత్రం ‘చంద్రముఖి 2’ . సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు. కాగా మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.  తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వారిని భయపెట్టిందా ? లేదా ??.. సినిమా రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..    

సినిమా కథ.. 

రంగనాయకి (రాధిక శరత్ కుమార్) ఫ్యామిలీకు  గత కొంత కాలంగా ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. దానికి పరిష్కారంగా స్వామీజీ (రావు రమేష్) ఫ్యామిలీ మొత్తం కలసి కుల దైవం గుడిలో పూజ చేయాలని చెప్తాడు. దీంతో వేరే దారి లేక గతంలో వేరే  మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వాళ్ళద్దరితో  పాటు గార్డియన్ గా మదన్ (రాఘవ లారెన్స్) కూడా అక్కడికి వస్తాడు. వారి కుల దైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (అప్పటి చంద్రముఖిలో ఉన్న బిల్డింగ్) ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ యజమానులు ఎవరూ ఉండరు. బసవయ్య (వడివేలు) మాత్రమే అక్కడ కాపలాగా ఉంటూంటాడు. ఆ ఇంట్లో రంగనాయకి కుటుంబం దిగుతుంది.

ఆ ఇంట్లో దక్షిణం వైపు వెళ్లవద్దని బసవయ్య వారికి కండీషన్ పెడతాడు. కానీ కొందరు దక్షిణం వైపు వెళ్తారు.  ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? ఈ కథలో వేటయ్య రాజు  (ఇంకో రాఘవ లారెన్స్) పాత్ర ఏంటి, చంద్ర‌ముఖి ఈ సారైనా ప్ర‌తీకారం తీర్చుకుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

మూవీ విశ్లేషణ..  

ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి వ‌చ్చేసింది. అయితే చంద్రముఖిలో చంద్రముఖి ని ఆవాహన చేసుకున్న అమ్మాయి చంద్రముఖిలా బిహేవ్ చేస్తే ..ఇప్పుడు అసలైన చంద్రముఖి రంగంలోకి దిగేసింది అని మూవీ టీం చెప్పింది. అయితే మొదటి నుంచి ఈ సినిమా సేమ్ చంద్రముఖి లాగానే సాగుతుంది. లారెన్స్ వైపు నుంచి చూస్తే ఇప్పటికే ముని, కాంచన అంటూ వరస పెట్టి దెయ్యం సీరిస్ లు చేసేసి ఉన్నాడు. దాంతో లారెన్స్ నుంచి ఈ తరహా కథాంశం కొత్తగా అనిపించదు. స్క్రీన్ ప్లే సైతం సాదాసీదాగా అనిపిస్తుంది. చంద్రముఖి స్క్రీన్ ప్లే (ఒరిజనల్ మళయాళం)ని ఫాలో అవ్వటం మూలానో ఏమో కానీ ఇప్పటికి ఫ్రెష్ గా ఉంటుంది. ఇది దుమ్ము కొట్టిన బిల్డింగ్ లోకి ప్రవేశిస్తున్నట్లే ఉంటుంది. ఏదైమైనా చంద్రముఖి ఈ సారి అంతగా భయపెట్టలేదు. వడివేలు ఈసారి మాత్రం నవ్వించలేదు. క్లైమాక్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మరి పార్ట్ 3 లో రజినీ మళ్ళీ వస్తారా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.

ఎవరెలా చేశారంటే.. 

రాఘవ లారెన్స్‌కు ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. ‘ముని’ దగ్గర నుంచి లారెన్స్ ఇలాంటి పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. కానీ పీరియాడిక్ పోర్షన్‌లో వచ్చిన వేటయ్య రాజు/సెంగోటయ్య పాత్రలో తన నటన అద్బుతం. కంగనా రనౌత్ కూడా చంద్రముఖి పాత్రలో అలరిస్తుంది. చంద్రముఖి ఆత్మ పట్టిన పాత్ర పోషించిన నటి మొదట్లో ఆకట్టుకున్నా.. తర్వాత తన నటన అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. మిగతా పాత్రలందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం.కీరవాణి బాగానే ఉన్నా.. పాటలు కానీ, నేపథ్య సంగీతం కానీ తన స్థాయికి తగ్గట్లు లేవు. సెకండాఫ్‌లో కంగనా రనౌత్ ఇంట్రడక్షన్ సాంగ్ మెప్పిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వార్ సీన్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాహుబలిని గుర్తు చేస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. వడివేలు, లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్, రావు రమేష్ పర్వలేదనిపించారు.

కంక్లూజన్.. 

చంద్రముఖి రేంజ్ కాకపోయినా.. ఒకసారి చూడొచ్చు