Site icon Prime9

Kangana Ranaut: కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌కు చండీగఢ్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం నాడు ఆమె చండీఘడ్‌ నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు చండీఘడ్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. సెంట్రల్‌ ఇండస్ర్టీయల్‌ సెక్యూరిటీకి చెందిన మహిళా సిబ్బంది కంగన రనౌత్‌ను చాచి చెంపదెబ్బకొట్టారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

ఫోన్‌ను ట్రేలో పెట్టడానికి నిరాకరించి..(Kangana Ranaut)

అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సెక్యూరిటీ చెక్ వద్ద మహిళా భద్రతా సిబ్బంది కంగనను ఫోన్‌ను ట్రేలో పెట్టడమని చెప్పడం.. దానికి ఆమె నిరాకరించారు. దీంతో పాటు ఆ మహిళా భద్రతా సిబ్బందిని నెట్టివేయడంతో ఆమె కంగన చెంప చెళ్లుమనిపించింది. తర్వాత ఆమె విస్తారా విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ వెళ్లిపోయారు. కాగా శుక్రవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటు సమావేశంలో హాజరు కావడానికి ఆమె ఢిల్లీ వెళ్లారు.

ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోకసభ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్‌పై 74,755 ఓట్ల మెజారిటితో గెలిచారు. కాగా రనౌత్‌కు మొత్తం 5,37,022 ఓట్లు పోలయ్యాయి. మండి నియోజకవర్గంలో సుమారు మంది పోటీ పడ్డారు. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,77,173 గా తేలింది. కాగా మొత్తం పోలైన ఓట్లు 73.15 శాతంగా తేలింది. తనను గెలిపించినందుకు ఆమె మండి ఓటర్లకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన ఎక్స్‌ ఖాతాలో మండి కీ సంసద్‌ అంటూ క్యాప్షన్‌ పోస్ట్‌ చేశారు. కాగా కంగన ప్రధానమంత్రికి మద్దతుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సిటిజన్‌ షిప్‌ అమాండ్‌మెంట్‌ యాక్ట్‌-2019లో , రైతుల ఉద్యమం సమయంలో కూడా ఆమె మోదీకి అండగా నిలిచారు. అలాగే అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఆమెను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు ప్రధాని మోదీ.

Exit mobile version