Site icon Prime9

Naga Chaitanya: నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని ఆమె పూడుస్తుందని నమ్ముతున్నా – శోభితతో పెళ్లిపై నాగచైతన్య కామెంట్స్‌

Naga Chaitanya About Marriage

Naga Chaitanya Open Up On His Marriage With Sobhita: తన కాబోయే భార్య శోభితా ధూళిపాళపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. గతకొద్ది రోజులు నాగచైతన్య-శోభితల పెళ్లి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీరి వివాహ వేదిక, ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల నాగార్జున వీరి పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.

ఇప్పుడు శోభితతో తన పెళ్లిపై తొలిసారి పెదవి విప్పాడు నాగ చైతన్య. నిన్న(నవంబర్‌ 23) తన పుట్టిన రోజు సందర్భంగాఓ అంగ్లా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా శోభితాతో పెళ్లిపై స్పందించాడు. ఈ మేరకు చై మాట్లాడుతూ.. తనతో జీవితం పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. నా జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందని నమ్ముతున్నా అంటూ కాబోయే సతీమణిపై ప్రేమ కురిపించాడు.

“ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దగా ఆర్బాటాల్లేవు. సింపుల్‌గా, సంప్రదాయపద్దతిలోనే మా పెళ్లి జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియో మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకత. అది మా తాతగారికి ఇష్టమైన స్థలం. స్టూడియో తాతయ్య విగ్రహం ముందే మా పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మాకు ఉండాలనే ఇరు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఏర్పాట్లు చాలా ఉత్సాహం జరుగుతున్నాయి. ఇక వివాహ ఏర్పాట్లు, వేడుకకు వచ్చే గెస్ట్‌ లిస్ట్‌లను ఇద్దరమే దగ్గరుండి చూసుకుంటున్నాం. శోభితాకు నేను చాలా కనెక్ట్‌ అయ్యాను. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది.

నా జీవితంలో ఏర్పడిన అగాథాన్ని ఆమె పూడుస్తుందని నమ్ముతున్నా. అందుకే తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా సమంత విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఆమెతో సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న చై ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చాడు. ఆగష్టు 8న చై-శోభితలు సైలెంట్‌గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రింగులు మార్చుకున్నారు. వీరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు నాగార్జున షేర్‌ చేసి అధికారిక ప్రకటన ఇచ్చాడు.

Exit mobile version