Kangana Ranaut:ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కొన్ని నవ్వు పుట్టించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఒక్కోసారి చిన్న పేరు తేడా కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇక తాజాగా జరిగిన సంఘటనకు వద్దాం. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ పొలిటికల్ ర్యాలీలో ఆమె ఆర్‌జేడీకి చెందిన తేజస్వి యాదవ్‌ను తిట్టబోయి బీజేపీకి చెందిన బెంగళూరు (దక్షిణ ) ఎంపీ తేజస్వి సూర్యనుపై తిట్ల దండకం ఎత్తుకున్నారు.
చెడిపోయిన రాకుమారుడు..(Kangana Ranaut)
తేజస్వి సూర్యను ఉద్దేశించి చెడిపోయిన రాకుమారుడని, దాదాగిరి చేయడం.. బహిరంగంగా చేపలు తినడం చేస్తుంటారని ఆమె లాలు కుమారుడు తెజస్వి యాదవ్‌ను తిట్టాలనుకొని బీజేపీకి చెందిన తేజస్వి సూర్యను తిట్టేశారు. వాస్తవానికి బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇటీవల ఒక వీడియా విడుదల చేసి పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యారు. ఆ వీడియోలో చేపలు తింటున్నానని చెప్పి చేపలు , రొటి చూపించాడు. దీనిపై బీజేపీతో పాటు ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇక కంగన రనౌత్ విషయానికి వస్తే ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు అవకాశం చిక్కినప్పుడల్లా ఇటు రాహుల్‌గాంధీతో పాటు అటు హిమాచల్ కాంగ్రెస్ నాయకుడు విక్రమాదిత్య సింగ్‌పై చిందులు వేస్తుంటారు.
బడా పప్పు.. చోటా పప్పు..
ఇటీవల ఆమె మనాలీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. బడా పప్పు.. చోటా పప్పు అంటూ విమర్శలు గుప్పించారు. జూన్ 1న మండి నియోజకవర్గానికి పోలింగ్ జరుగనుంది. అయితే ప్రచారంలో మాత్రం ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. సామాన్య ఓటర్లకు దగ్గరవుతున్నారు. రోడ్ షోలు, చిన్ని చిన్న గుంపులపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సినిమా నటి కాబట్టి ప్రజలు కూడా దగ్గర నుంచి చూడాలని ఆశపడుతుంటారు. క్విన్ సినిమాతో బాగా పాపులర్ అయిన కంగన తో సెల్పీ దిగడానికి చాలా మందిపోటీ పడుతున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ఆమె స్థానిక మహిళలతో కలిసి డ్యాన్స్‌లు చేయడం, దేవాలయాల ప్రాంగణంలో చీపురుతో ఊడ్చడం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్థానికులతో వారితో యాసలో మాట్లాడి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మండి కూతురునని గొప్పగా చెప్పుకుంటారు కంగన.