Site icon Prime9

Kanguva OTT: అప్పుడే ఓటీటీకి సూర్య ‘కంగువా’ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Kanguva Movie OTT Release Date: స్టార్‌ హీరో సూర్య నటించి లేటెస్ట్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘కంగువ’. భారీ అంచనాల మధ్య నవంబర్‌ 14న విడుదలైన అ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రీమియర్స్‌తోనే డివైట్‌ టాక్‌ తెచ్చుకుంది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్ షో నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. దాదాపురూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా.. ఇప్పటి వరకు మొత్తం రూ. 130 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే చేసిందని సమాచారం.

నిజానికి సెకండాఫ్‌ మూవీ చాలాబాగుంది. కానీ, ఫస్టాఫ్‌లోని మొదటి 40 నిమిషాలు బోర్‌ కొట్టించిందని ఆడియన్స్‌ నుంచి రివ్యూస్‌ వచ్చాయి. దీంతో ఫస్టాఫ్‌లో 12 నిమిషాలు కత్తిరించిన లాభం లేకుండ పోయింది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనుకున్న కంగువాకు ప్లాప్‌ టాక్‌ రావడంతో నిర్మాతలు భారీ నష్టాలను చూశారు. ఇదిలా ఉంటే ‘కంగువా’ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రిలీజ్‌కు ముందే కుంగువా ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అయ్యింది. ఈ సినిమాను సొంతం చేసుకుంది పలు ఓటీటీ సంస్థలు పోటీ పడగా చివరికి అమెజాన్ ప్రైం సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 100 కోట్లు పెట్టినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

ఒప్పందం ప్రకారం నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రావాల్సిన కంగువా అంతకుముందే స్ట్రీమింగ్‌ వచ్చే అవకాశం ఉందని సోషల్‌ మీడియాతో తెగ ప్రచారం జరుగుతుంది. ఈ లేటెస్ట్‌ బజ్ ప్రకారం.. కంగువాను ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు అమెజాన్ ప్లాన్‌ చేస్తుంది. డిసెంబర్‌ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు మేకర్స్‌ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసిందట. తాజా సమాచారం ప్రకారం కంగువా డిసెంబర్‌ 13వ తేదీన ఓటీటీ విడుదల కానుందని టాక్‌. దీనిపై అధికారిక ప్రకటన లేదు. క్లారిటీ రావాలంటే ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దిశ పటానీ హీరోయిన్‌గా నటించింది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో జ్ఞానవేల్‌ రాజాతో పాటు యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

Exit mobile version