Site icon Prime9

Nara Lokesh: జగన్.. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావ్.. మంత్రి లోకేశ్ ఫైర్

Nara Lokesh Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చిక్కీల్లో కూడా నిధులు గోల్ మాల్ చేసి.. సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని లోకేశ్ ఆరోపించారు.

ఆనాటి బకాయిలు నా నెత్తిన రూ.6,500కోట్లు పెట్టారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బకాయిలను విడుదల చేశామని గుర్తుచేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరు ఉన్న రూ.3,500 కోట్లు బకాయిలు ఉండడంతో సర్టిఫికెట్లు రాక లక్షలమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అయితే ఈ సమస్యను కూడా పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్‌బాల్ ఆడుకుందన్నారు. అయితే రీయింబర్స్ మెంట్ ఇక నుంచి కాలేజీలకే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన నిధులు త్వరలోనే చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శుల చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు 4 లక్షలమంది విద్యార్థులు వెళ్లిపోయారన్నారు. ఇది నిజమా ? కాదా? అని నిలదీశారు. మొదటి నుంచి తప్పుడు ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపిందన్నారు. నాడు నేడు తో జగన్ అండ్ కో ఫేక్ పబ్లిసిటీ చేయించుకుందని, పాఠశాలలో కనీసం మంచి నీరు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేక విద్యార్థులు వెళ్లిపోయారన్నారు. ప్రస్తుతం విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు సుమారు 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఏపీని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.

Exit mobile version