Site icon Prime9

Kulwinder Kaur: కంగనా రనౌత్‌ను కొట్టిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ .. కారణం ఏం చెప్పిందో తెలుసా?

Kulwinder Kaur

Kulwinder Kaur

Kulwinder Kaur: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ను చండీఘడ్‌ విమానాశ్రయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు గురువారం చాచి లెంపకాయ కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా రనౌత్‌ చండీఘడ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరడానికి ముందు సెక్యూరిటీ చెక్‌ వద్ద ఈ ఘటన జరిగింది. కాగా ఈ సంఘటన తర్వాత సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున లేడీ కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ ఫోటోలు, వీడియోలు హల్‌చల్‌ చేశాయి. ఇంతకు ఆ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌కు కంగనపై ఆగ్రహం రావడానికి ప్రధాన కారణం.. ఢిల్లీలో జరిగిన రైతుల నిరసనపై బాలీవుడ్‌ నటి కంగన తన నోటికి వచ్చినట్లు వాగడమే. ఉత్తరాది రైతుల నిరసన కార్యక్రమంలో వచ్చిన వారు రూ.100 రూ.200 తీసుకుని వచ్చిన వారేనని చులకగాన మాట్లాడారు.

సస్పెండ్ చేసిన అధికారులు..(Kulwinder Kaur)

ఈ వ్యాఖ్యలు లేడీ కానిస్టేబుల్‌ ఆగ్రహానికి కారణమైంది. స్వతాహాగా రైతు కుటుంబానికి వచ్చిన కుల్వీందర్‌ కౌర్‌.. ఈ నిరసన కార్యక్రమంలో తన తల్లి, సోదరుడు కూడా పాల్గొన్నారని చెప్పారు. చెంప దెబ్బతిన్న బాలీవుడ్‌ నటి తర్వాత ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తనపై జరిగిన దాడిని బట్టి చూస్తే పంజాబ్‌లో పెరిగిపోతున్న టెర్రరిజం ఎలా ఉందో ఈ ఘటన చూస్తే తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను క్షేమంగా ఉన్నానంటూ తన అభిమానులకు చెప్పారు. ఇదిలా ఉండగా సీఐఎస్‌ఎఫ్‌ దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో భద్రత నిర్వహిస్తుంటాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమెను సస్పెండ్‌ చేయడంతో పాటు విచారణకు ఆదేశించారు. శుక్రవారం నాడు ఆమెను అరెస్టు చేశారు.

ఈ సంఘటన జరిగినప్పుడు విమానాశ్రయంలో ఉన్న వారు రికార్డు చేశారు. అటు తర్వాత భద్రతా సిబ్బంది ఆమెను ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. కాగా కుల్వీందర్‌ కౌర్‌ విషయానికి వస్తే ఆమె 2019లో సీఐఎస్‌ఎఫ్‌ లో చేరారు. అటు తర్వాత ఏవియేషన్‌ సెక్యూరిటీ గ్రూపు ఆఫ్‌ ఫోర్స్‌లో 2021 నుంచి చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 35 ఏళ్ల ఈ మహిళ పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోధికి చెందిన వారు. గత రెండేళ్ల నుంచి ఆమె చండీఘడ్‌ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆమె భర్త కూడా సీఐఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సోదరుడు షేర్‌ సింగ్‌ విషయానికి వస్తే రైతు నాయకుడు కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటి ఆర్గనైజేషన్‌ సెక్రటరీ.

ఇక సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆమెపై విజిలెన్స్‌ ఎంక్వైరీ లేదా ఆమె శిక్ష పడిన ఘటనలు లేవు. అయితే ఆమె భర్త కూడా అదే విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ హల్‌చల్‌ చేస్తున్న కౌర్‌ వీడియోలో దేశవ్యాప్తంగా జరిగిన రైతుల ఉద్యమంపై కంగన చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అందుకే చెప్పదెబ్బ కొట్టానని చెప్పారు. ఈ రైతు ఉద్యమానికి తన సోదరుడు నాయకత్వం వహిస్తున్నాడని ఆమె చెప్పారు. ఇక నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ విమెన్‌ రేఖా శర్మ మాత్రం కంగనను చెంప దెబ్బ కొట్టిన కౌర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐఎఫ్‌ఎస్‌ అధికారులను కోరారు. ప్రయాణికుల భద్రతను చూడాల్సిన వారే నిబంధలను అతిక్రమిస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు.

 

Exit mobile version