Site icon Prime9

Kangana Ranaut: షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ ఎంట్రీ – కంగనా రనౌత్‌ కామెంట్స్‌

Kangana Ranaut Comments on Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇండస్ట్రీ ఎంట్రీ ఖారారైన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ ఖాన్‌ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా షారుక్‌ ఖాన్‌ కొడుకు ఎంట్రీపై ప్రకటన ఇస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్యన్‌ ఖాన్‌ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడంపై తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

“సినీ నేపథ్యంకు చెందిన పిల్లలు(స్టార్‌ కిడ్స్‌) మేకప్‌ వేసుకోవడం, బరువు తగ్గడం. తమని తాము గాజుబొమ్మల భావించి నటీనటులుగా మారడం సాధారణ విషయమే. కానీ దానిని మించి వెళ్లాలనుకోవడం గొప్ప విషయం. ప్రస్తుతం భారతీయ సినిమా స్థాయిని పెంచుకోవడం అవసరం చాలా ఉంది. కానీ స్టార్‌ కిడ్స్‌లో చాలా మంది ఇండస్ట్రీలో సులభమైన మార్గాన్ని ఎంచుకుంటూ కెమెరా ముందు నిలబడి నటిస్తున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితుల్లో కెమెరా వెనక నిలబడటానికి మనకు ఎంతోమంది కావాలి. తక్కువ మంది మాత్రమే ఎంచుకున్న మార్గాన్ని ఆర్యన్‌ ఖాన్‌ ఎంచుకోవడం ప్రశంసనీయం.

రచయితగా, ఫిల్మ్‌ మేకర్‌గా అతడి ఆరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ ఆర్యన్‌ ఖాన్‌పై ప్రశంసలు కురిపించింది. కాగా ఎప్పుడు బాలీవుడ్ స్టార్‌ కిడ్స్‌పై విమర్శలు గుప్పించే కంగనా.. ఆర్యన్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌ చేయడం అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇదిలా ఉంటే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కొడుకైన ఆర్యన్‌ ఖాన్‌.. తండ్రి బాటలోనే హీరో అవుతాడని అంతా వెయిట్‌ చేశారు. కానీ అందుకు భిన్నంగా రైటర్‌, దర్శకుడిగా అతడు మెగాఫోన్‌ పట్టుకునేందుకు ఆసక్తి చూపించాడు.

ఆర్యన్‌ ఖాన్‌ ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్టు షారుక్‌ ఖాన్‌ తన ప్రకటనలో వెల్లడించాడు. ఈ వెబ్‌ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్‌తో పాటు షారుక్‌ రెడ్‌ చిల్లిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీ ఇండస్ట్రీ నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమకు సంబంధం లేని ఓ వ్యక్తి ఇండస్ట్రీలో వచ్చి ఎదిగిన తీరును వెబ్‌ సిరీస్‌గా ఆర్యన్‌ తెరకెక్కిస్తున్నాడు. దీనికి రైటర్‌ కూడా అతడు కావడం విశేషం. ఇందులో షారుక్‌, బాబీ దేవోల్‌ రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్ సింగ్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. దీనికి ‘స్టార్‌డమ్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version