kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌ను చండీఘడ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ సందర్భంగా అక్కడి లేడీ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. అటు తర్వాత సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆమెకు అనుకూలంగా కొందరు ..లేడీ సెక్యూరిటీ కానిస్టేబుల్‌కు మద్దతుగా మరి కొందరు నిలిచారు. దీనిపై శనివారం నాడు కంగన తన ఎక్స్ ఖాతాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. లేడీ కానిస్టేబుల్‌కు మద్దతుగా నిలిచిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రేపిస్ట్, మర్డర్ చేసినవాడు, దొంగ వీరంతా బలమైన ఏదో కారణంతోనే నేరం చేస్తారు. ఏ కారణం లేకుండా నేరం ఎవరు చేయరు. అయినా చట్ట ప్రకారం వారిని శిక్షించి జైలుకు పంపడం జరుగుతుంది.
క్రిమినల్స్‌కు మద్దతు తెలిపితే..(kangana Ranaut)
అలాంటి క్రిమినల్స్‌కు మీరు మద్దతు తెలిపితే.. మీరు కూడా వారి నేరంలో భాగస్వామిగా భావించాల్సి ఉంటుంది. అలాంటి నేరస్తులకు మద్దతు తెలిపితే మీ మానసిక స్థితి ఏమిటో తెలుస్తోంది. వారికి నేను ఇచ్చే సలహా ఒక్కటే దయ చేసి యోగా లేదా మెడిటేషన్ చేసుకోండి. లేదంటే మీ జీవితాలు సుఖం ఉండదు. దయచేసి నేరస్తులకు వత్తాసు పలకొద్దు.. ద్వేషం అసూయకు దూరంగా ఉండండి లేదంటే మీ జీవితం దుర్భరం అవుతుందని సుతిమెత్తగా హెచ్చరించారు కంగన.
అయితే కంగన ఢిల్లీలో రైతుల ఉద్యమం సందర్బంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆమె చెంప దెబ్బతినాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గనే వారు వంద, రెండు వందల రూపాయలు తీసుకొని వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారని కంగన వ్యాఖ్యానించారు. అయితే కంగనను చెంప దెబ్బకొట్టిన లేడీ కానిస్టేబుల్ తల్లి, సోదరుడు కూడా రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కోపంతో కంగనను చెంప దెబ్బకొట్టారు. అటు తర్వాత ఆమె విస్తారా విమానంలో డిల్లీ వెళ్లిపోయారు. అయితే బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలెబ్రిటీలు లేడీ కానిస్టేబుల్‌ను మద్దతుగా నిలిచారు. వారిలో బహిరంగంగా విశాల్ డడ్‌లాని ముందుకు వచ్చారు. ఒక వేళ లేడీ కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోతే ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఇది కాస్తా కంగనకు ఆగ్రహం తెప్పింది. అదే విధంగా షబనా ఆజ్మీ కూడా స్పందించారు.
షబానా ఆజ్మీ భర్త జావేద్ అఖ్తర్‌పై కంగన కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం షబనా, కంగనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. షబానా స్పందిస్తూ లేడీ కానిస్టేబుల్ చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పే అని వ్యాఖ్యానించారు. కాగా తన తల్లి కోసం వెయ్యి ఉద్యోగాలు కోల్పోవడానికి తాను సిద్దమేనని.. ఎలాంటి శిక్షకైనా సై అంటున్నారు లేడీ కానిస్టేబుల్.. ఇక అసలు విషయానికి వస్తే కంగన రనౌత్ ఇప్పటి వరకు లెక్కలేనన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు పలువురికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే.