Malli Pelli Movie Review : నరేష్, పవిత్ర “మళ్ళీ పెళ్లి” మూవీ రివ్యూ, రేటింగ్..?

  • Written By:
  • Updated On - May 26, 2023 / 02:37 PM IST

Cast & Crew

  • నరేష్ విజయకృష్ణ (Hero)
  • పవిత్రా లోకేష్ (Heroine)
  • జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు (Cast)
  • ఎంఎస్ రాజు (Director)
  • నరేష్ విజయకృష్ణ (Producer)
  • అరుల్ దేవ్, సురేష్ బొబ్బిలి (Music)
  • ఎంఎన్ బాల రెడ్డి (Cinematography)
2

Malli Pelli Movie Review : సీనియర్ నటుడు నరేష్ , పవిత్ర ముఖ్య పాత్రలు పోషించిన సినిమా “మళ్ళీ పెళ్లి”. ఈ సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కించగా.. విజయ కృష్ణ పతాకంపై నరేష్ సొంతంగా నిర్మించారు. నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. జయసుధ విజయ నిర్మల పాత్రలో నటించగా.. దివంగత సీనియర్ నటుడు శరత్ బాబు సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మెరిశారు. గత కొంతకాలంగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. తన మూడో భార్యతో వీడిపోతున్నట్లు ప్రకటించడం.. ఆ తర్వాత నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నట్లు చెప్పడం అంతా తెలిసిందే. ఆ తర్వాత.. అంతకు ముందు జరిగిన వారి జీవితాలనే తెర మీద ఆవిష్కరించారు.  మీరు చూడక తప్పదు అనేలా ప్రమోషన్స్ కూడా చేసి నేడు ( మే 26, 2023 ) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ.. 

సీనియర్ కథానాయకుడు, నటుడు నరేంద్ర (నరేష్ విజయ కృష్ణ)కు, ఆయన మూడో భార్య సౌమ్యా సేతుపతి (వనితా విజయ్ కుమార్)కి మధ్య రిలేషన్ అంత మంచిగా లేని రోజులు అవి. ఆ సమయం లోనే  నరేంద్రకు కన్నడ నటి, ఒకప్పుడు కథానాయికగా చేసిన పార్వతి (పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ మానసికంగా దగ్గర అయ్యి.. ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు. అసలు.. నరేంద్ర, సౌమ్య మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? పార్వతి, ఆమెతో పదకొండేళ్ళు సహ జీవనం చేసిన కన్నడ నటుడు (అద్దూరి రవి వర్మ) కి మధ్య గొడవలు ఏమిటి ? చివరకు వీళ్లిద్దరి జీవితంలో ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథాంశం.

మూవీ విశ్లేషణ (Malli Pelli Movie Review) .. 

ఒక నాణేనికి రెండు వైపులు ఉన్నట్లే.. ఇద్దరి వ్యక్తుల జీవితాలలో కూడా ఎవరి కోణం వారికి ఉంటుంది. నరేష్ కి ఉన్న ఆస్తి, పలుకుబడి కారణంగా తన వెర్షన్ ని ఈ విధంగా వ్యక్తపరిచారు. ఇది నిజమో కాదో తేల్చాల్సినది మనం కాదు.. నిజానిజాలు అయితే సదరు వ్యక్తులకు తప్ప మరొకరికి తెలియదు. ఇక ఈ సినిమాలో మాత్రం ఇంతకు ముందు నరేష్ చెప్పినట్లు ఇది బయోపిక్ కాదని.. రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి సినిమా తీయలేదని అన్న మాటలు కొంతమేర అబద్దం అనిపిస్తుంది. ఇది అయితే బయోపిక్ అని అర్దం అవుతుంది. మిగతా విషయాలు మనకు అనవసరం. సినిమా విషయానికి వస్తే.. నరేష్ జీవితంలోకి రమ్యా రఘుపతి, పవిత్రా లోకేష్ వచ్చిన తర్వాత జరిగిన అంశాలను ఎంఎస్ రాజు చూపించారు. ఫ్రంట్ – బ్యాక్ స్క్రీన్ ప్లే బావుంది. కొన్ని సన్నివేశాలను బోల్డుగా తీశారు. ట్రైలర్‌లో చూపించినట్టు నరేష్ వయసు మీద సెటైర్స్ వేశారు. అనన్యా నాగళ్ళను స్క్రీన్ మీద గ్లామరస్ గా చూపించారు. సాంగ్స్ బావున్నాయి. రీ రికార్డింగ్ కూడా ఓకే అనెల ఉంది. ఖర్చు విషయంలో నరేష్ వెనకడుగు వేయలేదని మాత్రం తెలుస్తుంది.

వారి ఒక్కొక్కరి జీవితంలో ఏం జరిగింది? అనేది చక్కగా చూపించారు. నరేష్, పవిత్ర ఫ్లాష్ బ్యాక్స్ చూసినప్పుడు వాళ్ళ మీద జాలి కలుగుతుంది. నరేష్, పవిత్రల వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది? బెంగళూరులో రమ్యా రఘుపతి ప్రెస్ మీట్ పెట్టక ముందు ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు.  క్లైమాక్స్ వచ్చే సరికి ఇటీవల టీవీల్లో మనం చూసిన ఎపిసోడ్స్ మళ్ళీ స్క్రీన్ మీద చూసినట్టు ఉంది. మొత్తానికి ఈ సినిమా చూసిన వారికి నరేష్ తప్పేమీ లేదని.. తప్పంతా రమ్యా రఘుపతిది అని అనిపించే సందేహం ఉంది. అలానే ఈ సినిమాకు నరేష్ హీరో, నిర్మాత కావడం వల్ల ఆయనకు అనుకూలంగా సినిమా తీసుకున్నట్లు ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది.

ఎవరెలా చేశారంటే..?

నరేష్, పవిత్రా లోకేష్ ఈ సినిమాలో నటించలేదు. జీవించేశారు ఎందుకంటే అవి వారి నిజాజీవితాలే కాబట్టి. వారి బయోపిక్ లో వాళ్ళే నటించారు అనే ఘనత ఈ జంటకే దక్కుతుంది. సౌమ్యా సేతుపతిగా వనితా విజయ్ కుమార్ విలనిజాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యారు. పార్వతి యంగ్ వెర్షన్ రోల్ లో అనన్య నాగళ్ళ గ్లామర్ ఒలకబోశారు. నరేంద్ర తల్లి విమలమ్మ పాత్రలో జయసుధ, సూపర్ స్టార్ పాత్రలో శరత్ బాబు కనిపించి మెప్పించారు. సినిమాలో స్క్రీన్ మీద ఎక్కువ శాతం నరేష్, పవిత్రా లోకేష్ ఏ కనిపించారు.

కంక్లూజన్.. 

తెలిసింది కొంచెం.. తెలియంది కొంచెం