Site icon Prime9

Naresh – Pavitra Lokesh : నరేష్ – పవిత్ర లోకేష్ విషయంలో అసలు ఏం జరుగుతుందిరా బాబు అంటున్న నెటిజన్లు..

interesting details about Naresh - Pavitra Lokesh relation and new movie

interesting details about Naresh - Pavitra Lokesh relation and new movie

Naresh – Pavitra Lokesh : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కపుల్స్ ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో బాగా వైరల్ అయిన కపుల్ మాత్రం నరేష్ – పవిత్ర లోకేష్ జంటే. గత కొన్ని నెలలుగా వీరి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతూ వస్తోంది. గతంలో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వచ్చాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్‌ 31న నరేశ్‌ షేర్‌ చేసిన వీడియోతో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నరేష్ పెళ్లి వీడియోను పంచుకుంటూ అందరీ ఆశీస్సులు కోరారు. నరేష్ స్వయంగా ట్వీటర్ ద్వారా పెళ్లికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు కావాలని కోరారు.

ఈ వీడియో చూసిన వారంతా వీరిద్దరూ నిజంగానే మళ్లీ పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు. అయితే తాజాగా నరేష్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ చూస్తే.. వీళ్ళ పెళ్లి మ్యాటర్ నిజమేనా? మూవీ ప్రమోషనా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ పోస్టర్ ఏంటంటే.. నరేష్, పవిత్ర ప్రధాన పాత్రలలో వస్తోన్న ‘మళ్లీ పెళ్లి’ సినిమా పోస్టర్. ఈ సినిమాకు ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు, కన్నడ లలో  బైలింగ్యువల్ సినిమాగా తీస్తున్నారు. కాగా ఉఆది కానుకగా ‘మళ్లీ పెళ్లి’ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను మూవీ టీమ్ విడుదల చేశారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లో నరేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమాలో నరేష్-పవిత్ర ఎలాంటి మ్యాజిక్ చేశారో చూడాలి.

 

కొంటెగా నవ్వుతున్న నరేష్ (Naresh – Pavitra Lokesh)..

ఇందులో పవిత్ర లోకేష్ ముసిముసిగా నవ్వుతూ ముగ్గు వేస్తుంటే.. నరేష్ కొంటెగా చూస్తున్నట్టు పోస్టర్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకూ నరేష్ పెట్టిన ఫోటోలు, పెళ్లి వీడియోలు అన్నీ కేవలం సినిమా పబ్లిసిటీ కోసమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నరేష్-పవిత్రల పెళ్లి అయిపోయిందని, హనీమూన్ కు కూడా వెళ్లిపోయారు అని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ వ్యవహారం చూసి అంతా షాక్ అయ్యారు. ఇలా కూడా పబ్లిసిటీ చేసుకుంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

నరేశ్‌ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా పవిత్ర సైతం తన భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ‘సమ్మోహనం’ చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్ – పవిత్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సందడి చేశారు. ప్రస్తుతం వీరి విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

 

Exit mobile version