Site icon Prime9

Malli Pelli Movie : నరేష్, పవిత్ర లోకేష్ ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ రిలీజ్.. ఇది రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీనే !

naresh and pavitra lokesh starring malli pelli movie movie trailer released

naresh and pavitra lokesh starring malli pelli movie movie trailer released

Malli Pelli Movie : ఇటీవల కొన్ని రోజుల క్రితం నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా ప్రకటించి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. నరేష్ , పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రలు [పోషిస్తున్న ఈ సినిమాలో నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. ఈ మళ్ళీ పెళ్లి సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తుండగా నరేష్ సొంతంగా నిర్మిస్తున్నారు. మళ్ళీ పెళ్లి సినిమా మే 26న తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కపుల్స్ ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో బాగా వైరల్ అయిన కపుల్ మాత్రం నరేష్ – పవిత్ర లోకేష్ జంటే. గత కొన్ని నెలలుగా వీరి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతూ వస్తోంది. గతంలో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వచ్చాయి. పలు సినిమాలలో కలిసి నటించిన ఈ జంట బయట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. అనంతరం నరేష్ తన మూడో భార్యతో గొడవలు పడటం, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది. నరేష్-పవిత్ర లోకేష్ పై పలు వార్తలు, గాసిప్స్ వచ్చినా మొదట స్పందించకపోయినా 2023 న్యూ ఇయర్ సందర్భంగా అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి, లిప్ కిస్ ఇచ్చుకున్న ఓ వీడియోని షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశారు.

అనంతరం మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూశాక మరోసారి అంతా ఆశ్చర్యపోయారు. నరేష్ లైఫ్ లో జరిగిందే ఈ టీజర్ లో చూపించడంతో ఇది నరేష్ – పవిత్రల కథే అని అనుకున్నారు అంతా. తాజాగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది కచ్చితంగా నరేష్ – పవిత్రాల బయోపిక్ అని అర్థమైపోతుంది. ట్రైలర్ లో నరేష్ – పవిత్ర ఎలా క్లోజ్ అయ్యారు, మూడో భార్య చేసిన రచ్చ ఏంటి?, ఇద్దరు కలిసి తిరగడం, గాసిప్స్.. ఇవన్నీ చూపించారు. దీంతో మళ్ళీ పెళ్లి ట్రైలర్ వైరల్ గా మారింది. నరేష్ – పవిత్రల రియల్ స్టోరీనే సినిమాగా తీస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.

 

Exit mobile version
Skip to toolbar