Site icon Prime9

Naresh Pavitra : నరేష్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన పవిత్ర.. నాకు సపోర్ట్ గా నిలిచిన ఏకైక శక్తి అంటూ !

actress pavitra shocking comments on vk naresh goes viral

actress pavitra shocking comments on vk naresh goes viral

Naresh Pavitra : దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయ నిర్మల తనయుడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు నరేష్. పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత కొంతకాలంగా నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్… తన మూడో భార్యతో వీడిపోతున్నట్లు ప్రకటించడం.. ఆ తర్వాత నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నట్లు చెప్పడం అంతా తెలిసిందే. ఇక ఆ మధ్య నరేష్, పవిత్రా హోటల్ గదిలో ఉన్నప్పుడు… ఆయన మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫుల్ గా రచ్చ చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ మరణించిన అనంతరం జరిగిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అ అతర్వాత తాము వివాహం చేసుకున్నాం అని ప్రకటించడం.. కానీ కొన్ని రోజుల తర్వాత వారి కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. నరేష్ , పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సినిమా “మళ్ళీ పెళ్లి”. వీరి రియల్ స్టోరీనే రీల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనలే తెరపై ప్రెజెంట్ చేస్తూ మీరు చూడక తప్పదు అనేలా ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

ఈ మళ్ళీ పెళ్లి సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తుండగా నరేష్ సొంతంగా నిర్మిస్తున్నారు. మళ్ళీ పెళ్లి సినిమా మే 26న తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. అయితే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. యాంకర్ మీకు నిజంగా పెళ్లి అయ్యిందా అని నరేష్, పవిత్రని అడగ్గా .. అందుకు పవిత్ర నవ్వుతూ నాకు అయిపోయినట్టే ఉంది అని చెప్పడం గమనార్హం ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అదే విధంగా అంతకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ ..  ఇక్కడున్న పెద్దలందరి ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకంటే న్యూ లైఫ్ ను ఆరంభించబోతున్నాను. దేవుడు ఎలా నిర్దేశిస్తే అలా మనం మన లైఫ్ ను ముందుకు తీసుకువెళ్లవలసిందే. చిన్నప్పటి నుంచి అందరిలాగానే నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉండేవి. నా చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. నా డ్రీమ్స్ ను నిజం చేసుకోవడం కోసమే సినిమాల్లోకి వచ్చాను. ఎంతో కష్టపడి నేను నా డ్రీమ్స్ ను నిర్మించుకున్నాను. దానిని కొన్ని దుష్టశక్తులు బ్రేక్ చేశారు. ఆ సమయంలో నాకు సపోర్టు నిలిచిన ఒక శక్తి నరేశ్ గారు. ఇక ఇప్పుడు మళ్లీ నా లైఫ్ ను బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టాను’ అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version