Naresh – Pavitra Marriage : సినీ నటుడు నరేష్ – పవిత్ర లోకేష్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యినట్లుగా తెలుస్తోంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియోతో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నరేష్ పెళ్లి వీడియోను పంచుకుంటూ అందరీ ఆశీస్సులు కోరారు. నరేష్ స్వయంగా ట్వీటర్ ద్వారా పెళ్లికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు కావాలని కోరారు.
మీ ఆశీస్సులు కావాలంటున్న నరేష్ – పవిత్ర జంట..
నరేశ్ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా పవిత్ర సైతం తన భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ‘సమ్మోహనం’ చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్ – పవిత్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సందడి చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. వీరివురు కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు నరేష్ పవిత్ర లోకేశ్.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023
వైరల్ గా పెళ్లి (Naresh – Pavitra Marriage) వీడియో..
పెళ్లి వీడియోలో పెళ్లి దుస్తుల్లో మెరిసిన నరేష్, పవిత్రా పూజారి మంత్రోచ్ఛరణ మధ్య పవిత్రబంధంలో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా నరేష్.. ‘మా ఈ కొత్త ప్రయాణంలో జీవితకాలం శాంతి & ఆనందం కోసం మీ దీవెనలు కోరుతున్నాను.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రాలోకేష్’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
గతేడాది నరేష్ తన మూడో భార్య రమ్యరఘుపతికి మధ్య వివాదాలు వచ్చి విడిపోయిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా ఏదైనా సినిమా కోసం ఈ వీడియో షూట్ చేశారా? అనే దానిపై పూర్తి సమాచారం లేదు. ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఇది ఓ సన్నివేశమని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. కాగా.. రమ్య రఘుపతితో నరేశ్ విడాకుల వ్యవహారం కోర్టు విచారణలో ఉండటం గమనార్హం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/