Site icon Prime9

Allari Naresh : నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగడానికి రీజన్ ఏంటో చెప్పిన అల్లరి నరేష్.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !

allari naresh opens on reason behind smoking 500 cigarettes in 4 days

allari naresh opens on reason behind smoking 500 cigarettes in 4 days

Allari Naresh : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్న హీరో అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు నాట విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతూ వచ్చాడు. ఈ తరుణంలోనే తన పంథాను మార్చి నాంది సినిమాతో మంచి హిట్ కైవసం చేసుకున్నారు. సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ కి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ అంటే ఇదే అని చెప్పాలి.

కాగా ఆ తర్వాత నుంచి వరుసగా సీరియస్ కంటెంట్ ఉన్న చిత్రాలు ఎంచుకుంటున్నారు నరేష్. ఈ క్రమంలోనే తర్వాత మారెదుమల్లి నియోజకవర్గం మూవీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు నాంది కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ విజయ్ కనకామెదల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. “ఉగ్రం” పేరుతో వస్తున్న ఈ మూవీ మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ చూస్తే అర్దం అవుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ని గమనిస్తే అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా యాక్షన్ సీన్స్ లో అల్లరి నరేష్ దుమ్ము దులిపేశాడని చెప్పాలి. మే 5 వ తేదన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ క్రమలోనే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నరేష్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఉగ్రం షూటింగ్ లో తాను అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. ఇందుకు చెప్పిన కారణం వింటే అందరికీ మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తుంది.

ఈ మూవీకి సంబంధించి అడవిలో షూట్ చేసిన ఒక ఫైట్ లో స్మోక్ మెషిన్స్ పెట్టారట. దానికి తోడు సిగరెట్ తాగుతూ రావాలని డైరెక్టర్ చెప్పాడట. ఆ ఎపిసోడ్ కోసం అల్లరి నరేశ్ నాలుగు రోజుల్లో దాదాపు ఐదారు వందల సిగరెట్లు కాల్చారట. దాంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతిందని అల్లురి నరేష్ చెప్పుకొచ్చారు. ఉగ్రం సినిమా కోసం యూనిట్ తో పాటు అందరూ కష్ట పడినట్లు చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ శివ కుమార్ గా నటిస్తున్నారు. మిస్సింగ్ కేసులు ప్రధాన ఉదంతంగా ఉగ్రం తెరకెక్కింది. అలానే సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మించారు. మిర్నా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నరేష్ చెప్పిన ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా కోసం మీ డెడికేషన్ అద్బుతం అన్న అంటూ నరేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మరికొందరు అన్న ఆరోగ్యం జాగ్రత్త అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version