Home / పొలిటికల్ వార్తలు
రాజస్థాన్ లో సీఎం మార్పు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోందని చెప్పవచ్చు. సీఎంగా సచిన్ పైలట్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గం కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసన బావుటా ఎగురవేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
జమ్ముకశ్మీర్లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్ ప్రకటించనున్నారు.
భాజాపాయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎంతో ముఖ్యం. ఈ నేపధ్యంలో ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇరువరు కలిసారు
జాతీయ స్థాయిలో పార్టీని స్థాపించాలనుకొనే నేతలకు విపక్ష పార్టీలు చెక్ పెట్టాయి. భాజాపాయేతర ప్రభుత్వంగా ఏర్పడాలని, అందుకు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు కేరాఫ్ ప్రధాన ఫ్రంట్ ఒక్కటేనంటూ నేతలు పిలుపునిచ్చారు
నంద్యాల వైకాపా శాసనసభ్యులు శిల్పా రవి పై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో పలు అంశాల పై మాట్లాడారు. వెన్నపోటు గురించి మాట్లాడడం ఎమ్మెల్యేకు తగదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి రవికి లేదన్నారు.
సీఎం జగన్ కుప్పం పర్యటనపై ఇంకా రాష్ట్రంలో రాజకీయ వేడి తగ్గలేదు. కుప్పం వేదికగా మాజీ సీఎం చంద్రబాబులపై జగన్ పలు ఆరోపణలు చేసారు. చేతకాని సీఎంగా అభివర్ణించారు. దీంతో ఎదురుదాడికి తెదేపా దిగింది.
హిందూ, ముస్లిం మద్య గొడవలు సృష్టించడమే భాజాపా, ఆర్ఎస్ఎస్ ల పనిగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దూకుడును మరింత పెంచింది. విశాఖపట్నంలో వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యన్నారాయణ వైకాపా నేతలపై సీరియస్ అయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయ వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్, భాజాపా నేతల మద్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఓ వైపు కేంద్రం పై కేసిఆర్ కాలుదువ్వుతుంటే, మరో వైపు భాజపా కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి నటనలో ఎస్వీ రంగారావును మించిపోయాడని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా విమర్శించారు. అనిత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియా ముందుంచారు.