Published On:

New Rules: ఇక నుంచి బైక్ పై ఇద్దరికీ హెల్మెట్లు

New Rules: ఇక నుంచి బైక్ పై ఇద్దరికీ హెల్మెట్లు

New Two Wheeler Rules: ఇకపై టూ వీలర్ కొనే వారు.. కచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. వాహనం నడిపేవారికి, వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ.. కేంద్ర మోటార్ వాహనాల చట్టం- 1989 పలు మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. కొత్త సవరణ నియమాల తుది నోటిఫికేషన్ అధికారిక గెజిట్ లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ రూల్ తప్పనిసరి అవుతుందని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది.

వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారి భద్రత కోసం కొత్త నిబంధనను కేంద్రం అమలులోకి తీసుకురానుంది. హెల్మెట్ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రతా చర్యను కూడా ప్రతిపాదించింది. అలాగే 2026 జనవరి 1 నుంచి 50 సీసీ కంటే ఎక్కువ పవర్, గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటే బైక్ లు, స్కూటర్లు సహా అన్ని కొత్త ఎల్2 కేటగిరీ బైకులకు యాంటీ- లాక్ బ్రేకింగ్ వ్యవస్థలను అమర్చాలని సూచనలు జారీచేసింది. వాహనానికి సడన్ బ్రేక్ వేసిన టైంలో వాహనాన్ని నియంత్రించడానికి, దానితో పాటు వాహనం జారిపోయే అవకాశాలను తగ్గిస్తుందని నివేదికలో స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: