Home / Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బుధవారం నాడు తేల్చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక జాతీయ అంశాల గురించి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆలోచిద్దామని అన్నారు. దీనితో కాంగ్రెస్కు దీదీకి మధ్య సంబంధాలు చెడిపోయినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు, ఆమె భారత ప్రధాని అయి ఉండాల్సిందని అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీష్ కుమార్ వెంట డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం జరిగింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం పంపిన లేఖపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య మళ్లీ మాటల యుద్ధంమొదలైంది.ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ పంపగా, వాటిలో బెంగాల్ ఒకటి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ ఆధార్ కార్డులను, ఆధార్ కార్డులు లేని వారిని గుర్తించాలని పేర్కొంది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు గాను 35 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని, లక్ష్యాన్ని సాధిస్తే టీఎంసీ ప్రభుత్వం మనుగడ సాగించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.2024లో నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కూడా అమిత్ షా చెప్పారు.
ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద షాక్. . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం టీఎంసీ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యను టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి అధికారికంగా అరెస్టు చేసింది.