Published On:

Tamilnadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుకి ఎనిమిది మృతి

Tamilnadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుకి ఎనిమిది మృతి

Explosion In Crackers Factory: తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. శివకాశిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఇవాళ భారీగా పేలుళ్లు జరిగి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. బాణసంచా కర్మాగారంలో మందుగుండు సామాగ్రి కలుపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి భవనంలోని మూడు గదులలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి: