రైల్వేశాఖ: వాటర్ బాటిల్ పై రూ.5 అదనంగా వసూలు.. లక్షరూపాయలు జరిమానా విధించిన రైల్వేశాఖ

వాటర్ బాటిల్ పై నిర్దేశించిన దానికంటే రూ.5 అదనంగా వసూలు చేసిన ఐఆర్‌సీటీసీ కాంట్రాక్టర్ కు రైల్వే శాఖ లక్షరూపాయల జరిమానా విధించింది.

  • Written By:
  • Publish Date - December 19, 2022 / 02:40 PM IST

Indian  Railways: బాటిల్ పై నిర్దేశించిన దానికంటే రూ.5 అదనంగా వసూలు చేసిన ఐఆర్‌సీటీసీ కాంట్రాక్టర్ కు రైల్వే శాఖ లక్షరూపాయల జరిమానా విధించింది.వాటర్ బాటిల్ అసలు ధర రూ.15 కాగా రూ.5 అదనంగా అంటే రూ20 వసూలు చేసారు. దీనికి సంబంధించి వివరాలివి.

చండీగఢ్ నుండి షాజహాన్‌పూర్‌కు 12232 (చండీగఢ్-లక్నో) రైలులో ప్రయాణికుడు ఒకరు వాటర్ బాటిల్ ను కొన్నారు. బాటిల్ పై ఎంఆర్‌పి రూ.15 ఉండగా రూ.20 కు దానిని విక్రయించారు. ఈ విషయాన్ని సదరు ప్రయాణికుడు వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.. రైలుకు దాని స్వంత ప్యాంట్రీ కారు లేదు. ఐఆర్‌సీటీసీ నుంచి లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్లు రైలులో ఆహారపదార్దాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్నారు. దీనితో సంబంధిత కాంట్రాక్టర్ చంద్రమౌళిని గుర్తించి అతడిని బాధ్యుడిగా చేస్తూ రైల్వే శాఖ లక్షరూపాయలు జరిమానా విధించింది. ఈ విషయాన్ని డివిజనల్ కమర్షియల్ అధికారులు తెలియజేసారు.