TG TET: బిగ్ అలర్ట్.. టెట్ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

TG TET 2024 Today Last Date: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 7న ప్రారంభమై సంగతి తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ గడువును మొదటగా బుధవారం వరకు ముగిసింది. కానీ దరఖాస్తులో ఏమైనా తప్పులను సరిచేసుకోవడానికి ఈ నెల 22 వరకు ఎడిట్ అవకాశం కల్పించారు.

కాగా, దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రాత్రిలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం ఎడిట్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రక్రియలో సమస్యలు ఉంటే ఫోన్ నంబర్.7032901383, 9000756178లను సంప్రదించాలన్నారు. ఇదిలా ఉండగా, కొంతమంది అభ్యర్థులు దరఖాస్తు గడువును పెంచాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సర్వర్ డౌన్ కావడంతో తాము దరఖాస్తు చేసుకోలేదని, గడువు పెంచితే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మొర పెట్టుకుంటున్నారు.

ఇప్పటివరకు 2లక్షలకు పైగా దరఖాస్తు వచ్చినట్లు సెట్ కన్వీనర్ జి.రమేష్ తెలిపారు. పేపర్-1కు 61,930 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్ -2కు అత్యధికంగా 1,28,730 మంది చేసుకున్నారు. ఇందులో రెండు పేపర్లకు దాదాపు 17,04 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. చివరి తేదీకి సమయం ఉండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 26వ తేదీన హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక, ఈ టెట్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. టెట్ ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల కానున్నాయి.