Site icon Prime9

Encounter: భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

Encounter underway between security forces and Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

ఒడిశా సరిహద్దులు మీదుగా దాటుకుంటూ చత్తీస్‌గఢ్‌లోకి కొంతమంది మావోయిస్టులు ప్రవేశించినట్లు సమాచారం అందింది. దీంతో నిఘా వర్గాల సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం ఆపరేషన్ చేపట్టింది.  మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని భద్రతా దళాగాలు గుర్తించి చుట్టిముట్టడంతో ఒక్కసారిగా పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దక్షిణ సుక్మా జిల్లా కొంటాలోని బెజ్జీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మృతదేహాలను గుర్తించినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరన్ చవాన్ తెలిపారు. ఇందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. అనంతరం మావోయిస్టుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఆటోమేటిక్ రైఫిల్స్ ‌తో ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-దంతెవాడ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏకే సిరీస్‌తో సహా పలు రైఫిళ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో భద్రతా దళాలు సాధించిన అతి పెద్ద విజయాల్లో ఈ ఎన్‌కౌంటర్ ఒకటిగా నిలిచింది.

Exit mobile version
Skip to toolbar