Chandigarh Mayoral Polls: చండీగఢ్ మేయర్ ఎన్నికలో అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన మనోజ్ సోంకార్ విజేతగా నిలిచారు. మొత్తం 36 ఓట్లకు గాను 16 ఓట్లు బీజేపీ దక్కించుకోగా ఆప్ పార్టీకి 12 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అనిల్ మాసి తేల్చడంతో ఆప్ పార్టీ బీజేపీపై మండిపడుతోంది.చండీగడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌లు రెండు కలిసి పోటీ చేశాయి.
అనిల్ విషయానికి వస్తే బీజేపీ మైనారిటి సెల్‌కు చెందిన సభ్యుడు అనిఆప్ పార్టీ చెబుతోంది. తాజాగా మేయర్ పదవిని బీజేపీ తన్నుకుపోవడంతో ఆప్ పార్టీ ఆగ్రహంతో చిందులు వేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు ప్రజాస్వామ్యాన్ని లూటీ చేశారని వ్యాఖ్యానిస్తే.. సీనియర్ నాయకుడు రాజీవ్ చద్దా స్పందిస్తూ.. ఇది దేశద్రోహ చర్య అని మండిపడ్డారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆప్‌పార్టీ సభ్యులు.. కాంగ్రెస్ సభ్యులు బీజేపీతో ఘర్షణకు దిగారు. ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు మాసి చుట్టుచేరి సంబరాలు చేసుకోవడంతో వెంటనే కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్లు బీజేపీ కార్పొరేటర్లతో బాహాబాహికి దిగారు.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేసారు..(Chandigarh Mayoral Polls)
చండీఘడ్ మేయర్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, ఇది ఆందోళనకు గురి చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎక్స్ ద్వారా స్పందించారు. మేయర్ ఎన్నికల్లోనే ఈ స్థాయికి దిగజారితే, వచ్చే లోకసభ ఎన్నికల్లో ఇంకెంత దిగుజారుతారని ఆయన బీజేపీని గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ మాత్రం ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన మాసి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నెముక లేని మనిషి అని వ్యాఖ్యానించారు. మాసి ఆరోగ్యం సరిగా లేనందువల్లే మేయర్ ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు.