Site icon Prime9

Allu Arjun: 20 ఏళ్లకు ముందు ఆయనతో అలా – అన్‌స్టాపబుల్‌లో చిరంజీవి గురించి అల్లు అర్జున్‌ కామెంట్స్‌

Allu Arjun Shocking Comments on Chiranjeevi: గత కొద్ది రోజులు అన్‌స్టాపబుల్‌ 4 సీజన్‌ అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు, ఫస్ట్‌ పార్ట్‌ అన్నింటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ఆయన పిల్లలు అల్లు అయాన్‌, అల్లు అర్హల సందడి బాగా ఆకట్టుకుంది. ఈ షోలో హోస్ట్‌ బాలయ్య పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై వేసిన ప్రశ్నలను చూపించి అందరిలో క్యూరియాసిటీ పెంచారు. మరి వీటికి బన్నీ ఎలా స్పందించాడు, మెగా ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్‌ చేశాడనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నిన్న ఈ షో సెకండ్‌ పార్ట్‌ ఆహాలో ప్రసారం అయ్యింది.

ఇందులో అల్లు అర్జున్‌ మెగాస్టార్‌ చిరంజీవి గురించి చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా నిలిచాయి. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం అందరికి తెలుసు. అలాగే గత ఇరవై ఏళ్లుగా నాకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం గురించి కూడా అందరికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఆయనతో నేను ఎలా ఉండేవాడినో ఎవరికి తెలియదు. 20 ఏళ్లకు ముందు నాపై ఆయన ప్రభావం చాలా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆయనను, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక హీరోగా కంటే కూడా వ్యక్తిగా ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఆయన నేను చిక్‌ బాబాయ్‌ అని పిలుస్తాను.

మా చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ అమెరికాకు తీసుకువెళ్లిన మొదటి వ్యక్తం ఆయనే. అప్పట్లో విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ టైంలో మామయ్య మా అందరిని అమెరికా తీసుకువెళ్లారు. అది చిన్న విషయం కాదు. అనుకుంటే ఆయన తన పిల్లల మాత్రమే తీసుకువెళ్లోచ్చు. ఆయన పిల్లలతో పాటు నన్ను శిరీష్‌తో కలిపి మొత్తం 10 మంది పిల్లలను ఫారిన్‌ ట్రిప్‌ తీసుకువెళ్లారు” అంటూ చిరుతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. అనంతరం చిరంజీవి గారు మా తాతయ్యకి చాలా గౌరవం ఇస్తారు.. ఒక్కోసారి మా నాన్న కూడా ఇవ్వనంత గౌరవం ఇస్తారని పేర్కొన్నాడు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

కాగా కొన్నేళ్లుగా అల్లు-మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే టైంలో అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల టైంలో పవన్‌కి కాకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు. ఇది సినీ, రాజకీయా వర్గాల్లో దుమారం రేపింది. ముఖ్యంగా అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెంచిందనేది అందరిలో నెలకొన్న సందేహం. అంతేకాదు మా హీరో, మీ హీరో అంటూ అల్లు-మెగా అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్‌ తర్వాత అంతా ప్రశంసలు కురిపిస్తే.. మెగా ఫ్యామిలీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ చిరుపై అభమానం చూపిస్తూ చేసిన కామెంట్స్‌ చూసి అంతా డైలామాలో పడిపోయారు. మెగా-అల్లు కంపౌండ్‌లో అసలేం ఏం జరుగుతుందా? అందరిని తొలిచేస్తుంది.

Exit mobile version