Site icon Prime9

Big Boss7 : రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ టికెట్ ఫినాలే రేస్ .. ప్రియాంక ప్లీజ్ అంటున్న అమర్ ఫిజికల్ అటాక్

big-boss7 latest ticket finale episode

big-boss7 latest ticket finale episode

Bigg Boss7 : బిగ్‎బాస్ షో చివరికి వచ్చేసింది . ఇప్పుడు ఈ హౌస్ లో టికెట్ ఫినాలే టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉండగా.. అందరూ ఫినాలే అస్త్రన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్ టిక్ టాక్ టిక్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో గడియారం ముల్లు తిరిగుతూ ఉంటే.. దానికి తగలకుండా జంప్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కులో ముందుగా ప్రశాంత్ ఔట్ అయ్యాడు. ప్రశాంత్ తర్వాత గౌతమ్, శోభా ఇద్దరూ అవుట్ అయ్యారు. ఇక తర్వాత ప్రశాంత్, శోభా ఇద్దరినీ సంచాలకులుగా నియమించారు. ఆ తర్వాత శివాజీ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత యావర్, అమర్ దీప్ అవుట్ అయ్యారు. ఇక చివరగా కేవలం ప్రియాంక, అర్జున్ మాత్రమే మిగిలారు. కాసేపటికి ప్రియాంక కిందపడిపోయింది. వెంటనే శివాజీ, శోభా, ప్రశాంత్ పరుగున వచ్చిన ప్రియాంకను లేపే ప్రయత్నం చేశారు. మొదటి రౌండ్ లో అర్జున్ టాప్ లో ఉన్నాడు. ఇక తర్వాత ఫ్లవర్ టాస్క్ తక్కువ పూలను సేకరించిన ప్రియాంక, శివాజీలను తప్పించారు. ఇక రెండో రౌండ్ అయిపోయాక  శోభ అవుట్ అవ్వగా అందరి దగ్గరి పూలను ఒకరికి ఇవ్వమనగా అది అమర్ కి ఇచ్చారు , దీంతో  టాప్ స్థానంలో అమర్ ఉండగా.. రెండో స్థానంలో అర్జున్.. ఆ తర్వాత యావర్ ఉన్నాడు.

ఇప్పుడు అర్జున్, అమర్, ప్రియాంక, యావర్, ప్రశాంత్, గౌతమ్ కు గాలం వెయ్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో గాలం వేసి బాల్ పట్టుకుని తమ బాస్కె్ట్ వేసుకోవాలి. దీనికి శోభా, శివాజీలను సంచాలకులుగా నియమించారు. ముందుగా ప్రియాంక గాలం వేసి పట్టుకుంటే యావర్, అమర్ ఇద్దరూ ట్రై చేయగా.. చివరగా యావర్ బాల్ లాక్కున్నాడు. ఆ తర్వాత అర్జున్, గౌతమ్ బాల్స్ తమ బాస్కెట్ లో వేసుకున్నారు. చివరకు ప్రియాంక, అమర్ ఇద్దరు మాత్రమే మిగిలారు.

అయితే ముందుగా ప్రియాంక గాలం వేసి బాల్ తీసుకోగా.. ఆమె నుంచి బాల్ లాక్కునేందుకు తెగ ట్రై చేశాడు అమర్. ప్లీజ్ అమర్ వదిలెయ్ అంటూ అరుస్తూ అమర్ తో పోటిపడింది. కానీ అమర్ మాత్రం వదలకుండా ఫిజికల్ అటాక్ చేసి బాల్ లాక్కున్నాడు. అయినా ప్రియాంక బాల్ వదలకపోవడంతో బాల్ తోపాటు ప్రియాంకను పైకి ఎత్తి.. కిందపడేశారు. ఇది కరెక్ట్ కాదు.. వదిలెయ్ అంటూ అరిచింది ప్రియాంక. చివరకు అమర్ వదలకపోవడంతో అమర్ ను కొరికేసింది. చివరకు అమర్ ప్రియాంక దగ్గరి నుంచి బాల్ తీసుకుని బాస్కెట్ లో వేసుకున్నాడు. దీంతో చప్పట్లు కొడుతూ..వెరీ గుడ్ కంగ్రాట్స్ అంటూ గట్టిగా అరిచింది ప్రియాంక. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఏంటీ అమర్ నా నుంచి లాక్కోవడానికి కొంచెమైనా ఉండాలి కదా.. ఎంజాయ్ చేశావ్ కదా ? అంటూ ప్రియాంక అనడంతో రూల్ పెట్టింది కాబట్టి ఆడాను. ఆడకపోతే తప్పైపోతుంది కాబట్టి ఆడాను అని సమర్ధించుకున్నాడు అమర్. నేను వీక్ కాబట్టి లాక్కున్నావ్. నేను ఎవర్నీ గుంజుకోలేదు. ఫినాలేకు నేరుగా వెళ్తా అంటూ ఛాలెంజ్ చేసింది ప్రియాంక. అయితే వాష్ రూంలో ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది. అదే సమయంలో అమర్ ఆమె దగ్గరికి వెళ్లి ఓదార్చాడు. తర్వాత యావర్, గౌతమ్ ఇద్దరూ రావడంతో వాడి తప్పేం లేదు. నేను గేమ్ ను వదలను.. లాక్కున్నారని కోపం లేదు.. ఈ టైంలో మా మమ్మీ కావాలనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక.

Exit mobile version