Published On:

Huge Floods: ఉత్తరాఖండ్ వరదల్లో 9 మంది గల్లంతు

Huge Floods: ఉత్తరాఖండ్ వరదల్లో 9 మంది గల్లంతు

Cloud Burst In Uttarkashi: ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో కుంభవృష్టి వర్షాలు పడ్డాయి. బార్ కోట్- యమునోత్రి మార్గంలోని సిలాయ్ బాంద్ లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని ఉత్తరకాశీ కలెక్టర్ ప్రశాంత్ ఆర్య తెలిపారు.

 

మరోవైపు నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఉత్తరాఖండ్ లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నంద ప్రయాగ, భనేరోపాణి వద్ద జాతీయ రహదారి ధ్వంసమవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

 

ఇవి కూడా చదవండి: