Home / తప్పక చదవాలి
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు 2024 ఐపీఎల్ సీజన్లో కాలం కలిసివచ్చినట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లీగ్ పాయింట్స్ టేబుల్లో మొత్తం 14 మ్యాచ్‌లకు గాను కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచాడు.
రుణం పేరుతో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కాజేశారు కేటుగాళ్ళు. కర్నూలు ఆదోని పట్టణం ఇందిరానగర్ ఎరుకల కాలనీలో నివాసం ఉంటున్న ఎరుకల వెంకటరాముడు రోజు కూలీ పనులకు వెళ్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నారు
ఏపీలో ఎన్నికల ముగిసినప్పటికీ దానికి సంబంధించిన ఘటనలు ఇంకా వెంటాడుతూనే వున్నాయి . ఒక వైపు అల్లర్లు కేసులు ,మరో వైపు ప్రముఖలు పర్యటనలో అలసత్వం చూపించినందుకు పోలీసులపై చర్యలు కొనసాగుతున్నాయి .
పాత బకాయిలు చెల్లించక పోవడంతో ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే .దింతో కొంత బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది .అయినప్పటికీ ఆస్పత్రుల యాజమాన్యం అసోసియేషన్ మొత్తం బకాయిలను చెల్లించాలని పట్టుపట్టింది.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలో దారుణం జరిగింది. శ్రీవారినగర్‌కు చెందిన వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి (25 ) అలియాస్ శేషు ను దుండగులు కిరాతకంగా హతమార్చారు.
కాపు సంక్షేమసేన అధ్యక్షులు చేగొండ హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉంటూ అధికారంలో భాగస్వామి అయితే రెండో పవర్ సెంటర్ అయ్యేది మాత్రం నిజమన్నారు.
పపువా న్యూ గినియాలో కొండచరియలు విరగిపడి సుమారు 300 మంది సమాధి అయినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కాగా రెస్యూ వర్కర్లు మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.
జీవితాంతం తోడుంటానన్న భర్త చివరికి భార్యనే హతమార్చాడు. ఈ దారుణం బాచుపల్లిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ అయిన తన భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు.
: లోకసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టేంది బీజేపీనే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అదే కోవలో యోగేంద్ర యాదవ్ కూడా కేంద్రంలో బీజేపీనే అధికారం చేపట్టబోతోందన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాకశీర్షికల్లో ఉంటోన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్‌లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు.