Home / తప్పక చదవాలి
మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం చికాన్గవా పర్వతప్రాంతంలో కుప్పకూలడంతో ఆయనతో పాటు మరోపది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిలో చిలిమా భార్య కూడా ఉన్నారని ప్రెసిడెంట్ లాజారస్ చాక్వేరా మంగళవారం నాడు వెల్లడించారు.
సింగరేణి కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
చత్తీస్గడ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జులై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం నాడు తొలి కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. మంత్రులకు పోర్టుపోలియోలు కూడా కేటాయించారు
శాండిల్‌వుడ్ టాప్ హీరో దర్శన్ తూగుదీప, ఆయన భార్యపవిత్ర గౌడను ఓ హత్య కేసులో పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా దర్శన్ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేయడంలో కీలకపాత్ర వహించాడని పోలీసులు మంగళవారం చెప్పారు.
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. చీమ చిటుక్కుమన్నా యావత్ ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతోంది. తాజాగా గువాహతి రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన వీడియోను కోట్లాది మంది చూశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో అన్న క్యాంటీన్లకు మళ్లీ కళొచ్చింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం అన్నక్యాంటీన్లు ప్రారంభించింది. 5 రూపాయిలకే పేదలకు, నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించింది.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు.
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
కర్నూలు జిల్లా వెల్దురి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిడిపి నాయకుడు గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.