Home / తప్పక చదవాలి
వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో జాయిన్ అవుదామనుకునే వారి బలహీనతలనుఆసరాగా చేసుకుని కొంతమంది దందాకు తెరతీస్తున్నారు. కాలేజీ యాజమన్యాలతో మాట్లాడి సీట్లు ఇప్పిస్తామని చెబుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు
Tomatoes: దాదాపు అన్ని భారతీయ వంటల్లో టమటా కావాల్సిందే. కూరలు, గ్రేవీలు ఇలా ఏది వండాలన్నా టమాటా లేకుండా వండడం కష్టం అవుతుందని కొందరు వాపోతున్నారు. టమాటా లేనిదే రుచి రాదు. మరి టమాటాలు రేటు పెరిగిన వేళ టమాటాలకు బదులుగా ఇవి వాడండి.
హ్యుందాయ్ ఇండియా సరికొత్త ఎక్స్టర్ను రూ. 5.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. హ్యుందాయ్ ఎక్స్టర్ టాటా పంచ్ మరియు మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి వాటితో పోటీ పడనుంది. కొత్త ఎక్స్టర్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 9.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
15 మంది మహిళలను మోసగించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరులోని బనశంకరి నివాసి 35 ఏళ్ల మహేష్ కెబి నాయక్‌ను 2014 నుండి కనీసం 15 మంది మహిళలను వివాహం చేసుకుని తరువాత వారి నగదు మరియు నగలతో పారిపోయాడు. అతడిని మైసూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
అమెరికా ఎన్నారైలు ఏర్పాటు చేసిన తానా సభలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో గత మూడు రోజుల్లో వర్షాల కారణంగా కనీసం 34 మంది మరణించారు. గత 24 గంటల్లో పది మరణాలు నమోదయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 34 మందిలో పిడుగుపాటుకు 17 మంది, మునిగిపోవడం వల్ల 12 మంది, భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.
AI News Anchor: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందని చెప్పాలి. ప్రతి రంగంలోనూ ఏఐ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు. తక్కువ కాలంలో ఆక్యురేట్ సమాచారాన్ని అందించండంలో ఏఐ తనదైన పాత్ర పోషిస్తుంది.
గత నెలలో మరణించిన ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ 100 మిలియన్ యూరోలను (రూ. 9,05,86,54,868) తన 33 ఏళ్ల స్నేహితురాలు మార్టా ఫాసినాకు తన వీలునామాలో రాసినట్లు గార్డియన్ నివేదించింది. మూడు సార్లు ఇటాలియన్ ప్రధాన మంత్రి సామ్రాజ్యం విలువ 6 బిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఉత్తర భారతంలోదేశరాజధాని ఢిల్లీతో సహా పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి.ఢిల్లీ ఎన్‌సిఆర్‌కి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు, దేశ రాజధాని ప్రాంతం అంతటా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పంజాబ్ మరియు హర్యానా లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.
జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడని జనసేన అధినేత పవన్ఖ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి ఏలూరులో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా దాడిచేస్తున్నారు.