Home / తప్పక చదవాలి
LiFi: వైఫైకు మించిన సాంకేతికత మార్కెట్లోకి రానుంది.. అదే ‘లైఫై’. అసలు లైఫై అంటే ఏంటి..? ఇదిలా పనిచేస్తోందో ఓ సారి తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని యూట్యూబర్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా రూ.24 లక్షల నగదు దొరికింది. విచారణలో ఉన్న తస్లీమ్ కొన్నేళ్లుగా యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడని మరియు దాదాపు రూ.1 కోటి సంపాదించాడని అధికారులు తెలిపారు.
స్కాట్లాండ్ దీవిలోని సముద్రతీరంలో చిక్కుకున్న 50 పైలట్ తిమింగలాలు చనిపోయాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు, సముద్ర రక్షకులు లూయిస్ ద్వీపంలోని నార్త్ టోల్స్టాలోని ట్రైగ్ మోర్ వద్దకు చేరుకున్నారు. వారు డజన్ల కొద్దీ పైలట్ తిమింగలాలు ప్రాణాపాయస్దితితో ఉన్నట్లు గుర్తించారు
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వాలని యోచిస్తోంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (IIA)ని విదేశీ ఆపరేటర్లకు అవుట్సోర్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
Telangana: రోజురోజుకి కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ వంటి కూరగాయలు అన్నీ మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి.
భారీ వర్షాల నేపధ్యంలో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భీమ్‌గోడ బ్యారేజీ యొక్క ఒక గేటు దెబ్బతింది. దీనితో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.హర్ కి పౌరి ఘాట్ సమీపంలోని భీమ్‌గోడ బ్యారేజీ యొక్క స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో హరిద్వార్‌లోని గంగలో నీటి మట్టం ఆదివారం హెచ్చరిక స్థాయి 293 మీటర్లకు చేరుకుంది. అధికారులు హై అలర్ట్ జారీ చేసి, దిగువన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడిని తన దూరపు బంధువును ప్రేమిస్తున్నాడని కిడ్నాప్ చేసి నిప్పంటించారు. బాధితుడిని శశాంక్‌గా గుర్తించారు. కాలిన గాయాలతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రోజురోజుకు టమోటా ధరలు పెరిగిపోతుండడంతో విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. టమోటా దొంగతనాలు సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు అనకాపల్లి లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లిలో ఓ వ్యక్తి తన కుమార్తెకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. పొన్ముడి తనయుడు, లోక్‌సభ ఎంపీ గౌతం సిగమణిపై కూడా సోదాలు జరుగుతున్నాయి
ఢిల్లీలో అధికారుల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ఆదివారం స్పష్టం చేసింది, ఇది సానుకూల పరిణామం' అని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. దీనిపై , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ,వారు (ఆప్) రేపు సమావేశంలో చేరబోతున్నారని నేను భావిస్తున్నాను. ఆర్డినెన్స్ విషయానికొస్తే, మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది.