Home / తప్పక చదవాలి
దేశరాజధాని ఢిల్లీలో జరిగే G20 సమ్మిట్‌కు తరలివచ్చే వివిధ దేశాల అధినేతల జీవిత భాగస్వాములకు మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ హౌస్‌లో ప్రత్యేక లంచ్‌తో విందు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.మెనూలో మిల్లెట్ ఆధారిత రుచికరమైన వంటకాలు ఉంటాయని వారు తెలిపారు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్యూటర్‌ను చంపినందుకు 14 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యూటర్ బాలుడిని నిత్యం దుర్భాషలాడేవాడని వాటిని వీడియో కూడా తీశాడని పోలీసులు తెలిపారు.పేపర్ కట్టర్ తో హత్య చేసిన మూడు రోజుల తర్వాత బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మాన్ని డెంగ్యూ మరియు మలేరియాతో పోల్చి, దానిని వ్యతిరేకించడమే కాదు నిర్మూలన చేయాలని చెప్పడంపై దుమారం రేగింది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఖుషీ టీం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.
కొద్ది రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు నుంచి మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి జారీ చేసిన ఐటి నోటీసుల వివరాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల కాపీ ప్రైమ్9 చేతికి చిక్కింది. 2022 సెప్టెంబర్ నెలనుంచి ఆదాయపు పన్ను శాఖ, చంద్రబాబు నాయుడికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని తాజా నోటీసుల ద్వారా తేలింది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 1) అర్థరాత్రి రెండు మినీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు. దుజైల్ మరియు సమర్రా మధ్య ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియాను ఉటంకిస్తూ వార్తా సంస్థ నివేదించింది. సలాహెద్దీన్ ప్రావిన్స్‌లోని వైద్య అధికారి మినీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయని చెప్పారు.
కోరుట్ల యువతి దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. చెల్లి చందనను హంతకురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ప్రియుడు షేక్ ఉమర్ సుల్తాన్‌తో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది.