Home / తప్పక చదవాలి
యాపిల్ ఐఫోన్లు మరియు ఇతర విదేశీ-బ్రాండెడ్ పరికరాలను పని కోసం ఉపయోగించవద్దని లేదా వాటిని కార్యాలయంలోకి తీసుకురావద్దని చైనా కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులను ఆదేశించింది. ఈ నిషేధం వచ్చే వారం ఆపిల్ ఈవెంట్‌కు ముందు రావడం గమనార్హం.
సెప్టెంబరు 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభమవుతాయి.సెప్టెంబర్ 19న, గణేష్ చతుర్థి సందర్భంగా, పార్లమెంటరీ కార్యకలాపాలు కొత్త పార్లమెంట్ భవనానికి మారనున్నాయని నివేదిక పేర్కొంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లో బాహుబాలి సిన్ రిపీట్ అయింది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చిన్నారిని చేతితో పట్టుకుని వాగు దాటే సీన్ అందరికీ గుర్తుంటుంది. అదే రకంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక తండ్రి తన కూతురికి వైద్యం చేయించేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో చేతితోనే పట్టుకుని వాగు దాటాడు.
సెప్టెంబర్ 18-22 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తొమ్మిది అంశాలను జాబితా చేసిన సోనియా రాబోయే సెషన్లో వాటిపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రధానిని కోరారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులని ఖరారు చేసేందుకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది.
16 సంవత్సరాల తరువాత ఇబ్రహీంపట్నం బిఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసులో పోలీసులకి రిపోర్టు ఇచ్చిన పూసపాటి వెంకట కృష్ణప్రసాద్‌ని విచారణకి హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు.
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు పరీక్షల్లో తేలింది.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొట్టతొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు.
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుండి కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్లో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీనితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విదేశీ విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ శుభవార్త చెప్పింది. 2030 నాటికి భారత్ నుంచి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రకటన చేశారు.