Minister KTR: ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ

తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి గుర్తుగా ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం కొంగర కలాన్‌లో జరిగింది.రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 08:22 PM IST

Minister KTR:  తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి గుర్తుగా ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం కొంగర కలాన్‌లో జరిగింది.రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

25వేల మందికి ఉద్యోగాలు..(Minister KTR)

ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు 1,656 కోట్లకుపైగా పెట్టుబడితో  ఏర్ఫాాటు కానున్న ఫాక్స్ కాన్  తయారీ కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లియూతో కలిసి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. కంపెనీతో 25వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

తెలంగాణ చరిత్రలోనే కీలక ఘట్టం..

ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ) 500 మిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు తెలంగాణ చరిత్రలోనే ఓ కీలక ఘట్టమని అన్నారు.టెక్నాలజీ, పరిశోధన, తయారీ తదితర రంగాలకు షెన్‌జెన్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు 30 ఏళ్లలో చైనా చేసిన పనిని తెలంగాణ 20 ఏళ్లలో చేస్తుందని, 1.5 మిలియన్ల శ్రామికశక్తిని సృష్టించడంతోపాటు 150 బిలియన్ డాలర్లను సృష్టించడం తెలంగాణ లక్ష్యం అని రామారావు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ ఆర్దిక వ్యవస్దలో వచ్చే పదేళ్లలో 2040 నాటికి తలసరి ఆదాయం $20,000కి చేరుతుందన్నారు.

తెలంగాణలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయనే దానిపై ఈ ఏడాది ప్రారంభంలో ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్ యంగ్ లియు చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ, ఫాక్స్‌కాన్ మధ్య ఎంఓయూ మార్చి 2న కుదిరిందని, దాదాపు 2.5 నెలల్లో శంకుస్థాపన జరగనుందని, ఇది తెలంగాణ నిబద్ధతను తెలియజేస్తోందని కేటీఆర్ అన్నారు.