Site icon Prime9

Yashasvi Jaiswal: యశస్వీ జైస్వాల్ సెంచరీ.. దిగ్గజ క్రికెటర్ల రికార్డులు సమం!

Yashasvi Jaiswal breaks records: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. తొలి టెస్టు మ్యాచ్‌లోనే యశస్వీ జైస్వాల్ సెంచరీ బాదాడు. దీంతో పలు రికార్డుల తన ఖాతాలో వేసుకున్నాడు.

23 ఏళ్లకే టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు యశస్వీ జైస్వాల్ నాలుగు సెంచరీలు సాధించగా..అంతకుముందు ఉన్న గవాస్కర్(4) రికార్డును సమం చేశాడు. 1984లో రవిశాస్త్రి, 1992లో సచిన్ టెండూల్కర్, 2024లో జైస్వాల్ మూడేసి శతకాలు చేశారు. అంతే కాకుండా 23 ఏళ్లకే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్‌గా యశస్వీ జైస్వాల్ నిలిచాడు. అంతకుముందు ఒకే ఏడాదిలో గవాస్కర్, కాంబ్లీ నాలుగు సెంచరీలు చేశారు. కాగా, 1971లో గవాస్కర్, 1993లో వినోద్ కాంబ్లీ నాలుగు శతకాలు సాధించారు.

ప్రస్తుతం భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ 71 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ(100) సెంచరీ చేశాడు. అలాగే పడిక్కల్(25 ), వాషింగ్టన్(29) పరుగులతో రాణించగా.. పంత్(1). ధ్రువ్ జురెల్(1) విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(100), నితీష్ రెడ్డి (38) ఉన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జైస్వాల్, రాహుల్ కలిసి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ వికెట్ కోల్పోకుండా 201 పరుగులు చేశారు.

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌ ఆడుతున్న యశస్వీ.. తొలి ఇన్నింగ్స్‌లో 8 బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. దీంతో అంతకుముందు యశస్వీపై పెట్టుకున్న ఆశవాహులు ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారు. కేవలం స్వదేశీ గడ్డపై మాత్రమే ఆడేలా ఉన్నాడంటూ భారత అభిమానులు అనుకున్నారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ విజృంభణతో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 205 బంతులను ఎదుర్కొని ఎనిమిది బౌండరీలు, మూడు సిక్సిర్లతో 161 పరుగులతో రాణించాడు.

 

Exit mobile version