Site icon Prime9

Samantha: మాజీ భర్త నాగచైతన్యపై సమంత షాకింగ్‌ కామెంట్స్‌!

samanatha Comments Ex Husband

Samantha Comments on Her Ex About Expensive Gifts: తన ఎక్స్‌పై వృథా ఖర్చు చేశానంటూ సమంత షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి. సామ్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందా? అని అంతా ఆలోచనలో పడ్డారు. కాగా నాగ చైతన్య త్వరలోనే శోభితను పెళ్లి చేసుకుంటున్న క్రమంలో తాజాగా సమంత ఓ షోలో చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

కాగా సమంత-నాగ చైతన్యలు ప్రేమించిన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక జీవితం కలతలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. వీరి విడిపోయి మూడేళ్లు అవుతున్న ఇప్పటికీ ఇది చర్చనీయాంశంగానే ఉంది. ఏ ఈవెంట్‌లో, ఇంటర్య్వూలో వీరు కనిపిస్తే చాలు.. తమ ఎక్స్‌లపై ఎలాంటి కామెంట్స్‌ చేస్తారనేది అందరిలో ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో సమంత తన లేటెస్ట్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్ ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’ ప్రమోషనల్‌ కార్యక్రమంలో భాగంగా కోస్టార్‌ వరుణ్‌ ధావన్‌తో కలిసి సరదా చిట్‌చాట్‌లో పాల్గొంది.

‘స్పైసీ రాపిడ్‌ ఫైర్‌’అంటూ సాగిన ఈ ఇంటర్య్వూలో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇష్టమైతే సమాధానం చెప్పాలి.. లేదు అంటూ మిర్చి తినాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వరుణ్‌ ధావన్‌ సమంతను ‘నువ్వు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బులో అనవసరంగా పోయిన ఖర్చు ఏంటీ?” అని ప్రశ్నించగా.. దానికి సామ్‌ “నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు” అంటూ నిర్మోహమాటం లేకుండ సమాధానం ఇచ్చింది. ఎంత ధర ఉంటుంది? అని అడగ్గా.. కాస్త ఎక్కువే అని చెప్పింది. ఇక కొనసాగిద్ధాం అంటూ ఈ టాపిక్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అయితే సమంత ఈ కామెంట్స్‌ తన మాజీ భర్తను ఉద్దేశించే చేసిందని అంతా అభిప్రాయపడుతున్నారు.

ఎక్స్‌ అంటే ఇంకేవరు చైతన్యనే కదా అని కొందరు అంటున్నారు. మొత్తానికి సమంత ఈ ప్రశ్న ఎక్స్‌పెన్సీవ్‌ ఆన్సర్‌ ఇచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌ని దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించారు. అమెజాన్ ప్రైం వేదికగా ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో సమంత నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. యాక్షన్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించిందని కొనియాడుతున్నారు. మొత్తం 200 దేశాల్లో రిలీజైన ఈ వెబ్‌ సిరీస్‌.. 150 దేశాల్లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Exit mobile version