ShadNagar Explosion: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులోని పరిశ్రమలో పేలుడు సంభవించింది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషన్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమై చెదురుగా పడ్డాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.