CM Revanth Reddy on Crop Loan Waiver: ఆగస్టు నాటికి మూడు విడతల్లో పంటరుణాలు మాఫీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

  • Written By:
  • Publish Date - July 17, 2024 / 07:35 PM IST

CM Revanth Reddy on Crop Loan Waiver: తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.లక్ష వరకు రుణాలు పొందిన రైతులకు మొదటి విడత నిధులు గురువారం సాయంత్రం విడుదలవుతాయని చెప్పారు. నెలాఖరులోగా రూ.1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని, ఆ తర్వాత ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.

రాహుల్ గాంధీ హామీ మేరకు..(CM Revanth Reddy on Crop Loan Waiver)

కేసీఆర్ నాయకత్వంలోని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రూ.28,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయడంలో విఫలమైందని ఆయన చెప్పారు. మొత్తం రూ.2 లక్షల రుణమాఫీని ఒకే విడతలో అమలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంటోందన్నారు.ఆగస్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.. ఆర్థిక ఇబ్బందులను పేర్కొంటూ ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అయినప్పటికీ . , రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికుందన్నారు. రుణమాఫీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు పార్టీ సభ్యులు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తాన్ని మాఫీ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు..రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గత ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇది తెలంగాణ ప్రజల పట్ల తమకున్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు.