Site icon Prime9

Agniveer: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..డిసెంబర్‌ 8 నుంచి ‘అగ్నివీర్’రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Agniveer Recruitment Rally in hyderabad: నిరుద్యోగులకు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ లో డిసెంబర్ 8 నుంచి 16 వరకు అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నియామక ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు.

పారదర్శకంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ..
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ / స్టోర్ కీపర్ ట్రెడ్స్ కు పదో తరగతి అర్హతగా ఉండాలని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని అధికారులు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీస్ (డబ్ల్యూఎంపీ) అభ్యర్ధులకు ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ జరిగే చోటుకి అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని బోర్డు సూచించింది.

Exit mobile version