High Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తుషార్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో తుషార్‌కు ఊరట లభించింది.  అతడిని  అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పింది.

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 04:47 PM IST

Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో తుషార్‌కు ఊరట లభించింది.  అతడిని  అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పింది. అదేవిదంగా విచారణకు సహకరించాలని తుషార్ ను ఆదేశించింది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ విచారణపై స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కూడా ఆయన ఆ పిటిషన్ లో కోరారు.ఈ నెల 21న విచారణకు రావాలని తుషార్, బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులుజారీ చేసింది.అయితే ఈ ముగ్గురు కూడా విచారణకు రాలేదు. అయితే తనకు ఆరోగ్యం బాగా లేనందున రెండు వారాల సమయం కోరినట్టుగా తుషార్ పేర్కొన్నారు.ఈ విషయమై తాను సిట్ కు మెయిల్ పంపానన్నారు.ఈ మెయిల్ కు స్పందించకుండానే లుకౌట్ నోటీసులు జారీ చేశారని తుషార్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

ఈ విషయమై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తుషార్ ను అరెస్ట్ చేయవద్దని సిట్ ను ఆదేశించింది. ఈ నెల 25న బీఎల్ సంతోష్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది.