TSPSC: తెలంగాణలో సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు.. ఈ కేసులో నిందితులకు రూ. 33.4 లక్షలు అందినట్లు సిట్ దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు.. ఈ కేసులో నిందితులకు రూ. 33.4 లక్షలు అందినట్లు సిట్ దర్యాప్తులో అధికారులు గుర్తించారు. వికారాబాద్ ఎంపీడిఓ కార్యాలయంలో పని చేస్తున్న భగవంత్ అతడి తమ్ముడు రవికుమార్ ను అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఏఈ పేపర్ ను తన తమ్ముడి కోసం భగవంత్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. డాక్యా నాయక్ ఖాతాలను విశ్లేషించంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో మెుత్తం నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌కు రూ.16 లక్షలు అందినట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ అకౌంట్ కు వచ్చిన నగదును అధికారులు స్తంభింపజేశారు. ఈ సొమ్మను జప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.