Site icon Prime9

President Murmu: నేడు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన.. కట్టుదిట్టమైన భద్రత

President Murmu to Visit Hyderabad Today: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నేటి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకోనున్న రాష్ట్రపతి, అక్కడి నుంచి నేరుగా రాజభవన్ చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎన్డీఆర్ స్టేడియంలో జరగనున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం ఆమె రాత్రికి రాజ్ భవన్‌ అతిథి గృహంలో బస చేస్తారు.

రేపు లోక్ మంథన్‌కు..
శుక్రవారం ఉదయం రాష్ట్రపతి హైదరాబాదు శిల్పారామం వేదికగా జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరు కానున్నారు. నేటి నుంచి 24వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పలు దేశాల ప్రతినిధులు పాల్గొనే సదస్సులో ఆమె భాగస్వామి కానున్నారు. ఆ కార్యక్రమం అనంతరం 22న మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

పటిష్ట భద్రత
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఎన్టీఆర్‌ స్టేడియంలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, విద్యుత్‌, వైద్య ఆరోగ్య శాఖలు, జీహెచ్‌ఎంసీతో నిర్వహించిన కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ భద్రతపై పలు సూచనలు చేశారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌తో కలిసి సమీక్షించారు.

Exit mobile version