Balkampet Ellamma Temple: మంత్రి పొన్నం ప్రభాకర్కు కోపం వచ్చింది. హైదరాబాద్ బల్కంపేట ఆలయంలో అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ, తోపులాట అధికం కావంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొటోకాల్ పాటించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని మంత్రి ప్రభాకర్ మండిపడ్డారు. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడంలో అధికారులు, పోలీసు యంత్రాంగం ఫెయిలైందన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. వీఐపీలు వస్తున్న సమయంలో సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు. పరిస్దితిని చక్కదిద్దాలని సూచించారు. అధికారుల వైఖరికి అలిగి నిరసనగా ఆలయం బయటే కూర్చుండిపోయారు. ఆయనతో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా బయట కూర్చున్నారు. చివరకు అధికారులు నచ్చచెప్పడంతో లోపలికి వచ్చి కళ్యాణో త్సవంలో వారు పాల్గొన్నారు. ఇలా ఉండగా అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.