Rakul Preet Singh: హైదరాబాద్‌లో ఎస్‌ఓటీ రాజేంద్రనగర్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈసందర్బంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
పాజిటివ్ గా తేలింది..(Rakul Preet Singh:)
అమన్ ప్రీత్ సింగ్ నిన్నే పెళ్లాడుతా, రామరాజ్యం వంటి సినిమాల్లో నటించాడు. అతనితో పాటు మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అమన్‌ప్రీత్‌తో సహా ఐదుగురికి మాదకద్రవ్యాల వినియోగం కోసం పరీక్షలు చేయగా వారికి పాజిటివ్ అని తేలింది. ఈ సందర్బంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శంషాబాద్), సిహెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ గుర్తించబడిన కస్టమర్లలో అమన్ ప్రీత్ సింగ్ మరో 12 మంది వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఆరుగురిని పట్టుకోగా, కొకైన్ వాడినట్లు నిర్ధారణ అయింది. విచారణలో, కస్టమర్లలో ఎవరైనా ఎవరికైనా డ్రగ్స్ విక్రయించినట్లు మాకు తెలిస్తే, వారిని ఆటోమేటిక్‌గా పెడ్లర్లుగా పరిగణిస్తామని చెప్పారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2021లో, రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లోని ED ముందు హాజరయ్యారు, అక్కడ ఆమె ప్రమేయం గురించి గంటల తరబడి విచారణ ఎదుర్కొంది. అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించడానికి ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను అందించమని ఈడీ ఆమెను కోరింది. రకుల్ తాజాగా విడుదలయిన భారతీయుడు 2 చిత్రంలో రకుల్ నటించింది.